హరోం హర టీజర్ ఎలా ఉందంటే?
ఎంత టాలెంట్ ఉండి ఏం లాభం. సరైన హిట్ లేనప్పుడు అన్నట్లుంది టాలీవుడ్ హీరో సుధీర్ బాబు పరిస్థితి. ఆయన హీరోగా నటిస్తున్న హరోం హర సినిమా రిలీజ్ కు ముస్తాబవుతోంది. జ్ఞాన సాగర్ ద్వారక దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ కానుంది. రీసెంట్గా ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.
కొన్ని దశాబ్దాల క్రితం జరిగిన పీరియాడిక్ డ్రామాగా ఈ సినిమా రూపొందింది. సుబ్రహ్మణ్యం హింసకు దూరంగా ఉంటాడు. ఎంత వద్దనుకున్నా అతన్ని తుపాకి వెతుక్కుంటూ వచ్చి చేరుతుంది. తలలు పండిన నేరస్థులున్న మాఫియా రాజ్యంలోకి సుబ్రహ్మణ్యం అడుగుపెడతాడు. అసలు హింసే వద్దనుకున్న యువకుడు రక్తపాతంలో మునగాల్సి వస్తుంది.
అసలు సుబ్రహ్మణ్యం చేసే పనేంటి? ఎందుకు అందులోకి వెళ్లాల్సి వస్తుంది? చివరకు ఏం చేశాడన్నదే అసలు కథగా తెలుస్తోంది. రా అండ్ రస్టిక్ ఫీలింగ్ కలిగించడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. ట్రెండ్ కు తగ్గట్టే యాక్షన్ ఎపిసోడ్స్, వయొలెన్స్ బాగా కుదిరాయి. ఆర్టిస్టులు కూడా భారీ సంఖ్యలోనే ఉన్నారు. టీజర్ చూస్తుంటే మాత్రం సినిమాలో మ్యాటర్ ఉన్నట్టే కనిపిస్తోంది. వచ్చే ఏడాది ఈ యాక్షన్ మూవీని రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.













