టాలీవుడ్లోకి హీరోగా మరో వారసుడు
టాలీవుడ్ లో ఇప్పుడు మళ్లీ వారసుల ఎంట్రీలు ఊపందుకుంటున్నాయి. త్వరలోనే బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వనున్నాడు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో అతని డెబ్యూ ఫిక్సైంది. పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా నందన్, రవితేజ కొడుకు మహా నందన్ కూడా రెండు మూడేళ్లలో తెరంగేట్రం చేసే అవకాశముంది.
సరిగా ఇదే సమయంలో సుధీర్ బాబు కొడుకు చరిత్ మానస్ ఎంట్రీకి రెడీ అవుతున్నట్లు తాజాగా రివీల్ చేశాడు. మరో నాలుగేల్లలో చరిత్ ఎంట్రీ ఉంటుందని సుధీర్ కన్ఫర్మ్ చేశాడు. సినిమాలంటే తనకెంతో ప్యాషన్ గా ఉన్నాడని, తమ ఫ్యామిలీ అంతా ఇప్పుడే వద్దన్నారని కొన్నాళ్లు ఆగమన్నా చరిత్ ఆగేలా లేడని సుధీర్ తెలిపాడు.
ఇప్పటికే చరిత్ యాక్టింగ్ లో ట్రైనింగ్ తీసుకుంటున్నాడని, స్టంట్స్ కు సంబంధించి చిన్న నాటి నుంచి ఎన్నో రకాల ట్రైనింగ్లు తీసుకుంటున్నాడని విలు విద్యల్లో ఆరితేరితున్నాడని అందరికీ తెలుసు. చరిత్ కు సంబంధించి ఇప్పటికే కొన్ని వీడియోలు నెట్టింట వైరల్ అయిన సంగతి తెలిసిందే. చరిత్ సుదీర్ కొడుకైనప్పటికీ అచ్చం మేనమామ మహేష్ పోలికలనే విషయం తెలిసిందే.













