సుధీర్ ముందు ఎన్నో సవాళ్లు
టాలీవుడ్ లో ఉన్న టాలెంటెడ్ హీరోల్లో సుధీర్ బాబు కూడా ఒకడు. కష్టపడే తత్వంతో పాటూ టాలెంట్ కూడా ఉన్నప్పటికీ తనకు అదృష్టం మాత్రం కలిసి రావడం లేదు. గత కొన్నేళ్లుగా తన పరిస్థితేమీ బాగోలేదు. ఈ నేపథ్యంలో తన తర్వాతి సినిమా హరోం హర పైనే సుధీర్ తన ఆశలన్నీ పెట్టుకున్నాడు. ఈ సినిమా మే 31న ప్రేక్షకుల ముందుకు రానుంది.
అదే రోజున మరి కొన్ని సినిమాలు కూడా రిలీజ్ కాబోతున్నాయి. ఈ పోటీ సుధీర్ కు పెద్ద సవాల్ గా మారనున్నట్లు అనిపిస్తుంది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా మే 17 నుంచి 31కు పోస్ట్ పోన్ అయిన విషయం తెలిసిందే. దీంతో ఓపెనింగ్స్ విషయంలో విశ్వక్ కంటే సుధీర్కే ఎక్కువ రిస్క్ ఉండనున్న విషయం స్పష్టంగా తెలుస్తోంది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిని నిర్మించింది సితార సంస్థ కాబట్టి పెద్ద సంఖ్యలో థియేటర్లు దొరుకుతాయి.
హరోం హరకు బయ్యర్లున్నప్పటికీ కంపేర్ చేస్తే ఆడియన్స్ ఫస్ట్ ఆప్షన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరినే అవుతుంది. ఈ సినిమా కాకుండా గంగం గణేశా, సత్యభామ, మ్యూజిక్ షాప్ మూర్తి, భజే వాయు వేగం కూడా అదే రోజున రిలీజ్ కానున్నాయి. ఇవన్నీ కాకుండా ఎలక్షన్స్ రిజల్ట్స్ ఈ సినిమా రిలీజైన అయిదో రోజే రానున్నాయి. ఆ రిజల్ట్స్ హడావిడిలో సినిమాకు రావాలంటే అంతగా ఎగ్జయిట్ చేసే కంటెంట్ ఉంటేనే ఆడియన్స్ వస్తారు. ఈ నేపథ్యంలో హరోంహర కు బ్లాక్ బస్టర్ టాక్ వస్తే సమస్యేం ఉండదు కానీ ఓ మోస్తరు టాక్ అయినా సరే కలెక్షన్స్ విషయంల ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు.













