సుధీర్ ఆ ఛాన్స్‌ను ఎలా వాడుకుంటాడో?
ఎన్ని సినిమాలు చేసినా, ఎంత కష్టపడినా సుధీర్ బాబు కు కెరీర్ లో సక్సెస్ మాత్రం దక్కడం లేదు. జ్ఞాన సాగర్ దర్శకత్వంలో సుధీర్ బాబు నటించిన కొత్త సినిమా హరోం హర ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు చెప్పుకునే పోటీ లేకుండానే రిలీజ్ కానుంది. ఏపీలో ఇప్పటికే ఎలక్షన్స్ హడావిడి పూర్తైపోయింది.
రేపు చంద్రబాబు ప్రమాణస్వీకారంతో బ్యాలెన్స్ ఉన్న హంగామా కూడా పూర్తవుతుంది. ఆ తర్వాతి రోజు నుంచి జనాల దృష్టి రాజకీయాల నుంచి సినిమా పైకి వస్తుంది. రిజల్ట్స్ సెగ వల్ల రీసెంట్ గా రిలీజై మంచి టాక్ వచ్చినప్పటికీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, మనమే సినిమాలు బాగా పెర్ఫార్మ్ చేయలేకపోయాయి. ఇప్పుడు హరోంహరకు ఆ సమస్యలేమీ లేవు.
ఈ సినిమాతో పాటూ మరో నాలుగు సినిమాలు అదే రోజున రిలీజవుతున్నప్పటికీ అవేమ సుధీర్ బాబు సినిమాకు పోటీ కాదు. కంటెంట్ బాగుండి, మౌత్ టాక్ బాగా వస్తే హరోంహర మంచి కలెక్షన్స్ సాధించే ఛాన్సు ఉంది. ఈ సినిమాకు థియేట్రికల్ బిజినెస్ రూ.5 కోట్ల వరకు జరిగింది. షేర్ రూ.6 కోట్లు వస్తే హరోంహరకు బ్రేక్ ఈవెన్ దక్కుతుంది. సినిమా బాగుంటే ఆడియన్స్ ఇప్పుడున్న సిట్యుయేషన్స్ లో ఇదేమీ పెద్ద టార్గెట్ కాదు. మాస్ సినిమా చూసి ఎన్నో నెలలు గడిచి పోతున్న టైమ్ లో ఆడియన్స్ ముందుకు వస్తున్న హరోంహర సుధీర్ బాబు కు ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి మరి.













