Koragajja: కొరగజ్జ కాంతారను మించుతుందా?
సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత సుధీర్ అత్తవర్(Sudheer Athavar) దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొరగజ్జ(Koragajja) సినిమాను త్రివిక్రమ సినిమాస్ (Trivikrama Cinemas), సక్సెస్ ఫిల్మ్స్(Success Films) బ్యానర్లు సంయుక్తంగా నిర్మించాయి. త్వరలోనే ఆడియన్స్ ముందుకు రానున్న ఈ సినిమా ముంబైలోని కొన్ని ఏరియాల్లో పూజించే ప్రధాన దేవత గురించి కొరగజ్జ చుట్టూ తిరగనుందని డైరెక్టర్ సుధీర్ తెలిపాడు.
గోపీ సుందర్(Gopi Sundar) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సంగీతం కోసం తాను సరికొత్త ప్రయోగాలను చేశానని, కొరగజ్జ కోసం తాను చాలా పరిశోధన చేయాల్సి వచ్చిందని తన ఎక్స్‌పీరియెన్స్‌ను షేర్ చేసుకున్నాడు. కొరగజ్జ కోసం గత చరిత్రను తెలుసుకోవాల్సి వచ్చిందని అందుకే సంగీతం చేయడానికి ఎక్కువ టైమ్ పట్టిందని గోపీ సుందర్ వెల్లడించాడు.
తులునాడులోని ఆచారవ్యవహారాలు, సంప్రదాయాలను అర్థం చేసుకుని ట్యూన్స్ కంపోజ్ చేశానని, మొత్తం సినిమాలో ఆరు సాంగ్స్ ఉన్నాయని, వాటిలో అన్నీ ప్రత్యేకంగా ఉంటాయని, కొరగజ్జలోని సాంగ్స్ ను ప్రముఖ సింగర్స్ పాడారని, ఈ సినిమా కాంతార(Kanthara) కంటే భిన్నంగా ఉంటుందని, 800 ఏళ్ల నాటి గిరిజనుల సంబంధిత దేవుడి కథతో ఈ సినిమా తెరకెక్కుతుందని డైరెక్టర్ సుధీర్ అత్తవర్ తెలిపారు.






