K-Ramp: కిరణ్ అబ్బవరం “K-ర్యాంప్” మూవీ టీజర్

సక్సెస్ ఫుల్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) నటిస్తున్న కొత్త సినిమా “K-ర్యాంప్” (K-Ramp) టీజర్ రిలీజైంది. ఈ టీజర్ సినిమాలోని హెవీ ఎంటర్ టైన్ మెంట్ కు చిన్న శాంపిల్ చూపించింది. కేరళ బ్యాక్ డ్రాప్ లో ఒక ఎనర్జిటిక్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా ఉండబోతున్నట్లు టీజర్ ద్వారా తెలుస్తోంది. కుమార్ క్యారెక్టర్ లో రిచ్చెస్ట్ చిల్లర్ గయ్ గా కిరణ్ అబ్బవరం చేసిన సందడి, ఫన్ తో టీజర్ ఆకట్టుకుంది. ఫుల్ ఎనర్జీతో యాక్టర్ గా కంప్లీట్ గా ఓపెన్ అప్ అయ్యి కుమార్ క్యారెక్టర్ లో నటించారు కిరణ్ అబ్బవరం. తన స్క్రీన్ ప్రెజెన్స్, బ్యూటీతో కేరళ అమ్మాయి మెస్సీ క్యారెక్టర్ కు హీరోయిన్ యుక్తి తరేజా పర్పెక్ట్ గా సెట్ అయ్యింది. సాయి కుమార్, మురళీధర్ గౌడ్, వెన్నెల కిషోర్, శివన్నారాయణ వంటి యాక్టర్స్ కీ రోల్స్ చేశారు. ‘ఇంతమంది చెప్పినా ప్రేమించావంటే నువ్వు డెఫనెట్ గా డెవిల్ గిఫ్టెడ్ చైల్డ్ రా..’, ‘అరేయ్ నీకు అందరూ చెబుతున్నార్రా బిల్డప్ లు ఎక్కువైనయ్ తగ్గించుకోమని, ఏం చేద్దాం, అవే చేద్దాం..’ అనే డైలాగ్స్ టపాసుల్లా పేలాయి. లవ్, రొమాన్స్, యాక్షన్, ఫన్ తో కంప్లీట్ ఎంటర్ టైనర్ గా “K-ర్యాంప్” ఉండబోతున్నట్లు టీజర్ ద్వారా తెలుస్తోంది. ఈ టీజర్ సినిమా మీద మరిన్ని ఎక్స్ పెక్టేషన్స్ పెంచేస్తోంది.
“K-ర్యాంప్” సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ బ్యానర్‌ల మీద రైజింగ్ ప్రొడ్యూసర్ రాజేష్ దండ, శివ బొమ్మకు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. “K-ర్యాంప్” సినిమాకు జైన్స్ నాని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ దీపావళి పండుగ సందర్భంగా అక్టోబర్ 18న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది.