Pa. Ranjith: స్టంట్ మాస్టర్ మృతి.. డైరెక్టర్ పై కేసు నమోదు

స్టంట్ మాస్టర్ మోహన్ రాజ్(Mohan raj) స్టంట్ చేస్తుండగా ప్రమాదం జరిగి చనిపోవడం మొత్తం కోలీవుడ్ లో కలకలాన్ని సృష్టిస్తోంది. ఆర్య(Aarya) హీరోగా పా.రంజిత్(Pa. ranjith) దర్శకత్వంలో తెరకెక్కుతున్న వెట్టువం(Vettuvam) షూటింగ్ లో ఈ ప్రమాదం జరగ్గా, కారు బోల్తా కొట్టే స్టంట్ లో పాల్గొన్న స్టంట్ మాస్టర్ మోహన్ రాజ్ అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం ఆ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.
వీడియోను చూసిన నెటిజన్లు డైరెక్టర్ పా.రంజిత్ పై మండిపడుతున్నారు. ఏఐ టెక్నాలజీ వచ్చాక కూడా స్టంట్ మాస్టర్లతో ఇలాంటి రిస్కీ షాట్స్ ఎందుకు చేయిస్తున్నారని ఫైరవుతున్నారు. డైరెక్టర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు పా. రంజిత్ సహా మరికొందరిపై కేసు నమోదు చేశారు. గత కొన్నేళ్లుగా స్టంట్ ట్రైనర్ గా వర్క్ చేస్తున్న మోహన్ రాజ్ వెట్టువం షూటింగ్ లో కారు బోల్తా కొట్టే సీన్ చేస్తుండగా అందులో పాల్గొని ప్రాణాలు కోల్పోయారు.
ప్రమాదం జరిగిన వెంటనే అతన్ని హాస్పిటల్ కు తీసుకెళ్లినప్పటికీ అప్పటికే మోహన్ రాజ్ ప్రాణాలు కోల్పోయినట్టు డాక్టర్లు కన్ఫర్మ్ చేశారు. మోహన్ రాజ్ మరణం తననెంతో కలచివేసిందని, ఆయన కుటుంబాన్ని ఆదుకుంటామని విశాల్(Vishal) తెలిపారు. ఈ స్టంట్ చాలా రిస్కీ అని దాన్ని చేయొద్దని స్టంట్ కొరియోగ్రాఫర్ దిలీప్ సుబ్బరాయన్(dileep subbarayan), మోహన్ రాజ్ కు చెప్పినా రాజ్ పట్టుబట్టి మరీ చేస్తానని ప్రాణాలు కోల్పోయినట్టు విశాల్ కీలక విషయాల్ని వెల్లడించారు.