అన్ స్టాపబుల్ లో ప్రభాస్ లుక్ అదుర్స్…!
రెబెల్ స్టార్ ప్రభాస్ లుక్స్ మీద గత కొంతకాలంగా చాలా రకాల కామెంట్స్ వింటూనే ఉన్నాం. బాహుబలి సినిమా తర్వాత సాహోలో మరీ దారుణంగా కనిపించి అభిమానులని నిరాశపరిచాడు. రాధే శ్యామ్ సినిమాలో మునుపటి చార్మ్ లేకపోయినా పర్వాలేదు అనిపించాడు. ఫేస్ కి ఏదో సర్జరీ చేయించుకున్నట్లు ఉన్నాడని కామెంట్స్ వినిపించాయి.
ఎన్ని నెగటివ్ ట్రోల్ల్స్ , కామెంట్స్ వచ్చినా ప్రభాస్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. అంతకంతకు ఫాన్స్ పెరుగుతూనే ఉన్నారు. రెబెల్ స్టార్ లిస్ట్ లో మరికొన్ని పెద్ద ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. అయితే ప్రభాస్ రానున్న సినిమాల్లో ఎలా కనిపిస్తున్నారు అనేది కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్ స్టాపబుల్ ఓటీటీ ప్రోగ్రామ్ లో ఈ పాన్ ఇండియా స్టార్ ఎలా కనిపిస్తారో అని అందరు ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు.
ప్రెజెంట్ అన్ స్టాపబుల్ షో రామానాయుడు స్టూడియోలో జరుగుతుండగా, ఈ షూటింగ్ స్టిల్స్ కొన్ని బయటకి వచ్చాయి. ఈ లీక్ అయిన వీడియోస్ , స్టిల్స్ లో ప్రభాస్ లుక్ అందరిని ఆకర్షించింది. ప్రభాస్ చాలా స్మార్ట్ గా ఉన్నారంటూ నెటిజన్స్ నుండి కామెంట్స్ వస్తున్నాయి.
అన్ స్టాపబుల్ షో లో ఈ ఎపిసోడ్ లో ప్రభాస్ తో పాటు గోపీచంద్ కూడా పాల్గొని సందడి చేసారు. బాలయ్య బాబు కూడా ఈ ఎపిసోడ్ కోసం చాలా కలర్ ఫుల్ గా కనిపించడం విశేషం. క్రిస్మస్ సందర్భంగా ఈ ఎపిసోడ్ డిసెంబర్ 25 న కానీ , న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1 న కానీ ఆహా లో స్ట్రీమింగ్ అవుతుంది.













