స్ట్రీట్ డ్యాన్సర్ ఫస్ట్ లుక్ విడుదల
వరస విజయాలతో జోరుమీదున్నాడు బాలీవుడ్ యువ కథానాయకుడు వరుణ్ ధావన్. ప్రస్తుతం రెమో డిసౌజా దర్శకత్వంలో ఏబీసీడీ సిరీస్‌లో వస్తోన్న మూడో చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు స్ట్రీట్ డ్యాన్సర్ అనే పేరుని ఖరారు చేశారు. ఈ విషయాన్ని వరుణ్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. రోడ్లపై నడవడం ఎందుకు? డ్యాన్స్ చేయండి. రూల్స్ బ్రేక్ చేయడానికి స్ట్రీట్ డ్యాన్సర్ నవంబరు 8న మీ ముందుకు వస్తాడు అని ట్వీటాడు. ఈ చిత్రంలో శ్రద్ధాకపూర్ కథానాయిక. పాకిస్తాన్ డ్యాన్సర్ పాత్రలో ఆమె కనిపించనుంది. పంజాబ్‌కు చెందిన డ్యాన్సర్‌గా వరుణ్ పాత్ర ఉండనుంది. ఈ సినిమాలో వరుణ్, శ్రద్ధా పూర్ల ఫస్ట్‌లుక్‌లను చిత్రబృందం విడుదల చేసింది. అవి అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.













