విజయ్- విజయ్ సేతుపతి ల ‘మాస్టర్’ ఆమెజాన్ ప్రైమ్ లో నేరుగా స్ట్రీమింగ్ అవుతుందా?
ఇప్పటి వరకు చిన్న సినిమాలు విడుదల చేయలేని పరిస్థితి వస్తే ఓటీటీ సంస్థలను ఆస్రహిస్తారని మనం అనుకుంటున్నాము. ఆ సినిమా తక్కవ బడ్జెట్ తో తీస్తారు కాబట్టి మరి పెద్ద హీరోల సినిమాల బడ్జెట్ 50, 60 కోట్ల వరకు ఉంటుంది. విడుదల వాయిదా పడితే వడ్డీలు కట్టలేక నిర్మాతలు భారీ నష్టాలు మూటగట్టుకోవాల్సి వస్తుంది. కానీ ఇందుకు వేరే మార్గం కూడా ఏమీ లేదు. అయితే లాక్ డౌన్ వేళ అమెజాన్ ప్రైమ్ వంటి ఓటీటీ వేదికలపై సినిమాలు రిలీజ్ చేస్తే ఎలా ఉంటుదన్న ఆలోచన కొన్ని రోజులుగా నిర్మాతల మదిలో మెదులుతోంది. ఇలా నష్టపోవడం కంటే .. ఓటీటీల్లో రిలీజ్ చేసుకుని.. నష్టాలబారి నుంచి తప్పించుకోవచ్చన్నది వారి ఆలోచన. ఇది ఎంతకాలం ఉంటుందో తెలియదు కదా. కానీ ఇందుకు కొందరు స్టార్లు సుముఖంగా లేరు. కానీ..
ఇక విషయానికొస్తే తాజాగా దళపతి విజయ్, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో నటించిన భారీ బడ్జెట్ మూవీ ‘మాస్టర్’ సినిమాను అమెజాన్ ప్రైమ్‌లో విడుదల చేయాలని చిత్ర నిర్మాతలు భావిస్తున్నారట. ఈ చిత్రం జూన్ ౨౨ న విడుదల చేయడానికి ప్లాన్ చేసారు కానీ ఇదే నిజంగా జరిగితే..ఇక సినిమాలు ఓటీటీల్లో పెద్ద సినిమాలు కూడా నేరుగా విడుదల కావడం మొదలయ్యే అవకాశం పుష్కలంగా ఉంది.













