Stranger Things: త్వరలోనే సూపర్ హిట్ సిరీస్కు సీక్వెల్
ఓటీటీ ప్రపంచంలో సూపర్ హిట్ అయిన వెబ్ సిరీసుల్లో స్ట్రేంజర్ థింగ్స్(Stranger Things) ఒకటి. విచిత్రమైన పవర్స్ కలిగిన మనుషులు చేసే విన్యాసాలు ప్రేక్షకుల్ని కట్టిపడేస్తాయి. అందుకే ఈ సిరీస్ నుంచి ఎన్ని సీజన్లు వచ్చినా అన్నీ హిట్ అవుతూ వస్తున్నాయి. ఇప్పటికే ఈ సిరీస్ నుంచి నాలుగు సీజన్లు రాగా వాటన్నింటికీ ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్ వచ్చింది.
ఇప్పుడు స్ట్రేంజర్ థింగ్స్ నుంచి ఐదో సిరీస్ రానుంది. తాజాగా ఈ సీజన్ షూటింగ్ పూర్తి చేసుకుంది. మొత్తం 650 గంటల ఫుటేజ్ ను చిత్రీకరించినట్టు డైరెక్టర్లు డఫెర్ బ్రదర్స్(Dafer Brothers) వెల్లడించారు. ఈ సీజన్ తో స్ట్రేంజర్ థింగ్స్ సిరీస్ పూర్తవుతుంది. ముందు నాలుగు సీజన్ల కంటే ఫైనల్ పార్ట్ గా వస్తున్న ఈ సీజన్ లో యాక్షన్, ఎమోషన్ ఎక్కువగా ఉంటుందని డైరెక్టర్లు తెలిపారు.
సైన్స్ ఫిక్షన్ జానర్ లో వచ్చిన స్ట్రేంజర్ థింగ్స్ 5వ సీజన్ లో హాకిన్స్ సీక్రెట్స్ మరింత క్లిష్టంగా మారడంతో వాటిలోని పాత్రల భవిష్యత్తు మరింత విచిత్రంగా మారనుందని అర్థమవుతుంది. వాస్తవానికి సీజన్5 షూటింగ్ ఎప్పుడో పూర్తవాల్సింది కానీ హాలీవుడ్ లో జరిగిన స్ట్రైక్ కారణంగా షూటింగ్ దాదాపు 7 నెలలు లేటైంది. ఇప్పటికే ప్రమోషన్స్ ను మొదలుపెట్టిన నెట్ఫ్లిక్స్(Netflix) స్ట్రేంజర్ థింగ్స్ 5వ సీజన్ రిలీజ్ డేట్ ను త్వరలోనే వెల్లడించనుంది.













