శ్రీలీల ఎంబీబీఎస్ వెనుక అసలు కథ
టాలీవుడ్ లో అతి తక్కువ సినిమాలతో, అతి తక్కువ కాలంలో స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకున్న శ్రీలీల వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఆమె ఎనర్జీ, నటన, డ్యాన్సులు తెలుగు ప్రేక్షకుల్ని తెగ మెప్పిస్తున్నాయి. ఓ వైపు సినిమాలతో బిజీగా ఉంటూనే శ్రీలీల, ఎంబీబీఎస్ చదువుతుంది. ఈ విషయం చాలా తక్కు వ మందికే తెలుసు.
అయితే శ్రీలీల ఎంబీబీస్ చదవడానికి గల కారణాల్ని వివరించింది. తాను వైద్యుల కుటుంబం నుంచి రావడంతో అంటే శ్రీలీల తల్లి, అన్న డాక్టర్స్ కావడంతో తను ఈ వైద్య వృత్తి ఎంచుకోలేదని, దాని వెనుక చాలా పెద్ద కథే ఉందని శ్రీలీల తెలిపింది. ఓ రోజు శ్రీలీల తన అమ్మమ్మ ఇంటికి వెళ్లినప్పుడు వాళ్ల అమ్మమ్మ అనారోగ్యంతో పడిపోయిందని, అక్కడకు దగ్గరలో హాస్పిటల్ లేకపోవడంతో ఆ డాక్టర్ వచ్చే వరకు ఆమెను రక్షించడానికి తానేమీ చేయలేకపోయానని చెప్పింది.
ఆ టైమ్ లో తనను తాను పనికిరానిదానిని అనుకున్నట్లు, అప్పటికే మెడిసిన్ ఎంట్రెన్స్ హాజరైన తనను ఆ సంఘటన మార్చివేసిందని, వైద్య వృత్తిపై మంచి అభిరుచి, అంకితభావంతో కోర్సును కంటిన్యూ చేస్తున్నట్లు శ్రీలీల చెప్పుకొచ్చింది. షూటింగ్ బ్రేక్‌లో ఎంబీబీఎస్ లెస్సెన్స్ ప్రిపేర్ అవుతానని, ఎక్కువ టైమ్ ఉంటే హాస్పిటల్ కు వెళ్లి కోర్సును ప్రాక్టీస్ చేస్తానని తెలిపింది. ఇక కెరీర్ విషయానికి వస్తే శ్రీలీల నటించిన భగవంత్ కేసరి ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.













