నాగ్ సైమన్ పాత్ర వెనుక పెద్ద కథే ఉందిగా!
సూపర్ స్టార్ రజినీకాంత్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న కూలి సినిమాలో నాగార్జున ఉంటాడని కొన్ని రోజులుగా వస్తున్న వార్తలను నిజం చేస్తూ నాగ్ బర్త్ డే సందర్భంగా చిత్ర యూనిట్ ఆయన లుక్ ని రిలీజ్ చేస్తూ అఫీషియల్ గా కన్ఫర్మ్ చేసింది. రీసెంట్ గా ఈ సినిమా సెట్స్ లో ఉపేంద్ర జాయిన్ అయినప్పుడు నాగ్ ప్లేస్ లోనే ఆయన వచ్చాడనుకున్నారు.
కానీ ఇప్పుడు నాగ్, ఉపేంద్ర రెండూ వేర్వేరు పాత్రలని తెలియడంతో అందరూ చాలా ఎగ్జయిట్ అవుతున్నారు. విక్రమ్ లో సూర్య చేసిన రోలెక్స్ తరహాలో కూలిలో కూడా లోకేష్ ఇంట్రెస్టింగ్ క్యామియోలను డిజైన్ చేసి ఉంటాడనే టాక్ వినిపిస్తుంది. అయితే ఈ సినిమాలో నాగ్ పాత్ర వెనుక చాలా పెద్ద స్కెచ్ ఉన్నట్లు తెలుస్తోంది.
కూలిలో నాగ్ చేస్తున్న సైమన్ పాత్రకు ఎప్పుడో 1978లో వచ్చిన శంకర్ సీలం సైమన్ అనే తమిళ మూవీకి లింక్ ఉందని తెలుస్తోంది. ఆ సినిమాలో రజనీకాంత్ పేరే ఇప్పుడు లోకేష్ నాగ్ కు పెట్టాడు. మొత్తానికి కూలిలో నాగ్ క్రిస్టియన్ గా కనిపించనున్నాడనే క్లారిటీ అయితే వచ్చింది. బంగారం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ సినిమాలో చాలా సర్ప్రైజ్ లు ఉండనున్నాయని తెలుస్తోంది. కూలిని వచ్చే ఏడాది సమ్మర్ కు రిలీజ్ చేయాలనే టార్గెట్ తో షూటింగ్ చేస్తున్నారు. ఈ సినిమాలో శృతి హాసన్ కూడా ఓ కీలక పాత్రలో కనిపించనుంది.













