మహేష్ ఫ్యాన్స్ రూటే డిఫరెంట్!
ఏ హీరో ఫ్యాన్స్ అయినా హీరో బర్త్ డే సెలబ్రేషన్స్ కోసం అన్నదానాలు , రక్తదానాలు చేస్తారు. కానీ సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రం వీటితో పాటు మరింత క్రేజిగా వారి అభిమానాన్ని చాటుకొన్నారు.రెండు తెలుగు రాష్ట్రాల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ అంత ఇంత కాదు. మహేష్ బాబు తన 48 వ పుట్టినరోజుని ఆగస్టు 9 న జరుపుకుంటున్న విషయం తెలిసిందే.
అయితే మహేష్ అభిమానులు మాత్రం హీరో బర్త్ డే ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకొంటూ సోషల్ మీడియాలో మహేష్ బాబు పేరును ట్రెండ్ చేస్తున్నారు. అందరి హీరో ఫ్యాన్స్ యందు సూపర్ స్టార్ ఫ్యాన్స్ రూటే డిఫ్ఫరెంట్ అని ప్రూఫ్ చేసుకొంటున్నారు. మహేష్ బాబు అభిమానులు పుట్టినరోజు సందర్భంగా మహేష్ పేరున అంతరిక్షంలో ఒక స్టార్ ని కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించారు.
అభిమానులు ఇచ్చిన ఈ స్పెషల్ గిఫ్ట్ తో మహేష్ బర్త్ డే మరింత ప్రత్యేకంగా మారిందనే చెప్పాలి. మహేష్ ఫ్యాన్స్ ఇచ్చిన ఈ గిఫ్ట్ కి వేరే హీరో అభిమానులు మరియు కొంతమంది టాలీవుడ్ ప్రముఖులు కూడా ఆశ్చర్యపోతున్నారు. మహేష్ బాబు క్రేజ్ అంతరిక్షానికి చేరింది అని దానికి కారణం మహేష్ కి ఫ్యాన్స్ కి ఉన్న అనుబంధం అలాంటిది అని నెటిజన్లు అంటున్నారు.
అభిమానులు ఇచ్చిన ఈ గిఫ్ట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. మహేష్ పేరు మీద ఉన్న ఈ నక్షత్రం వివరాలు ‘RA: 12h 33m 29s +69 47’ 17.6 ‘ గా స్టార్ రిజిస్ట్రేషన్ సంస్థ సర్టిఫికెట్ ని కూడా జారీ చేసింది. మహేష్ బాబు ప్రస్తుతం ‘ గుంటూరు కారం ‘ అనే సినిమా దాని తరువాత పాన్ ఇండియా రేంజ్ లో రాజమౌళి తో సినిమాలు చేస్తున్నారు.













