వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా సూపర్‌హిట్ సినిమా ‘బింబిసార’ మరియు సరికొత్త సీరియల్ ‘చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి’తో కొత్త ఏడాది 2023కి ఘన స్వాగతం పలుకుతోంది జీ తెలుగు
2022 ఏడాదిలో అద్భుతమైన సీరియల్స్, సూపర్‌హిట్ సినిమాలతో తెలంగాణ మరియు ఆంధ్రపదేశ్రాష్ట్రాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది జీ తెలుగు. ఇప్పుడు కొత్త ఏడాది 2023లో కూడా ఆడియన్స్‌కు అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇందుకోసం ఓ సరికొత్త సీరియల్‌ని ప్రారంభిస్తోంది. అలాగే సూపర్‌హిట్ సినిమా బింబిసారను వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా ప్రసారం చేయబోతోంది. ఈ సినిమాను జనవరి 8, 2023 సాయంత్రం 6 గంటలకు ప్రసారం చేస్తోంది. అలాగే మహి గౌతమి, రాఘవేంద్ర ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్‌గా ప్రారంభిస్తోంది. ఈ సీరియల్ జనవరి 9, 2023 నుంచి సోమవారం నుంచి శనివారం వరకు మధ్యాహ్నం 2.30లకు ప్రసారం అవుతుంది. ఈ రెండింటితో కొత్త ఏడాది మొదటి వారంలోనే ప్రేక్షకుల కోసం అద్భుతమైన వినోదాన్ని సిద్ధం చేసింది జీ తెలుగు.
మొదటగా 2023 ఎంటర్టైన్మెంట్ బొనాంజా జీ తెలుగులో బింబిసార సినిమాతో మొదలుకానుంది. సినిమా కథ విషయానికి వస్తే… బింబిసారుడు మహా క్రూరుడు. అధికారమే పరమావధిగా త్రిగర్తల సామ్రాజ్యాన్ని పరిపాలిస్తుంటాడు. చివరికి తన సొంత తమ్ముడైన దేవదత్తుడిని కూడా అధికారం కోసం చంపేయాలని చూస్తాడు. అతడి నుంచి తప్పించుకుని బయట పడ్డ దేవదత్తుడు.. తనకు అనుకోకుండా దొరికిన మాయ అద్దం సాయంతో తన సోదరుడి అడ్డు తొలగించుకుని తండ్రి ఆకాంక్షలకు అనుగుణంగా రాజ్యాన్ని పరిపాలించడం మొదలుపెడతాడు. మాయ అద్దం వలన బింబిసారుడు ఎక్కడికి వెళ్లాడు, అతనికి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి, ధన్వంతరిని దక్కించుకోవాలన్న దుష్టుల ఆకాంక్ష ఫలించిందా అనేది మిగిలిన కథ. కల్యాణ్‌రామ్, కేథరిన్ థ్రెసా హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా జనవరి 8, 2023 సాయంత్రం 6 గంటలకు జీ తెలుగులో ప్రసారం కానుంది.
సూపర్‌హిట్ సినిమా బింబిసార తర్వాత కొత్త సీరియల్‌ను ప్రారంభిస్తోంది జీ తెలుగు. ఆ సీరియల్ పేరే చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి. ఈ సీరియల్ భాగ్యలక్ష్మి అనే అమ్మాయి చుట్టూ తిరుగుతుంది. భాగ్యలక్ష్మి ఉన్నత భావాలు గల అమ్మాయి. తనకు ఉన్నా లేకపోయినా… ఎదుటివారికి ఎల్లవేళలా సాయం చేయాలనే మంచి మనసు కలిగి ఉంటుంది. ఎదుటివారి ఆనందమే తన ఆనందంగా బతుకుతుంటుంది. మరోవైపు మిత్రా గ్రూప్ ఆఫ్ కన్స్ట్రక్షన్ కంపెనీ వారసుడు మిత్రా నందన్. తన కష్టంతో కంపెనీని ఉన్నత స్థాయికి తీసుకువెళ్తాడు. డబ్బుంటే చాలు ఏదైనా సాధించవచ్చు అనే మనస్తత్వం కలిగినవాడు. అన్నింటింకి మించి అమ్మకు ముద్దుల కొడుకు. తల్లి మాట జవదాటడు. అలాంటి మిత్రా నందన్ అనుకోని పరిస్థితుల్లో భాగ్యలక్ష్మిని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. విరుద్ధ భావాలున్న వీరిద్దరి జీవితాలు, పెళ్లి తర్వాత ఎలా మారాయి అనేదే అసలు కథ.
భాగ్యలక్ష్మి తన జీవితం ఎప్పుడూ ఆనందంగా ఉండాలని కోరుకుంటుంది. అదే సమయంలో తన చెల్లెళ్లకు మంచి సంబంధాలు తీసుకొచ్చి పెళ్లి చేయాలని ఆశపడుతుంది. అయితే ఆమెకు ఇంట్లో అలాంటి పరిస్థితులు ఉన్నాయా, మిత్రా నందన్-భాగ్యలక్ష్మి మధ్య ప్రేమ చిగురిస్తుందా, లేదా.? భాగ్యలక్ష్మి తన పెళ్లికి సంబంధించిన నిజాన్ని, మిత్ర జీవితానికి సంబంధించిన జ్యోతిష్య రహస్యాన్ని తనలోనే దాచుకుంటుందా తెలియాలంటే చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్‌ని ప్రతీ రోజూ మిస్ కాకుండా చూడాల్సిందే. ఈ కొత్త షో లాంఛ్ తో పాటు, పాపులర్ షో మిఠాయి కొట్టు చిట్టెమ్మ ప్రసారంలో కూడా చిన్న మార్పు. జీ తెలుగు లో సోమవారం నుంచి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3 గంటల నుంచి 3.30 వరకు ఇది ప్రసారం అవుతుంది.
ఆద్భుతమైన కథ, కథనాలు, ఊహించని మలుపులతో ఆద్యంతం కట్టిపడేసే చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్ ప్రతీ ఒక్కరికీ కచ్చితంగా నచ్చుతుంది. ప్రతీ రోజూ ప్రతీ ఎపిసోడ్ చాలా ఆసక్తిగా, ఎంటర్టైనింగ్ ఉంటూ ఆడియన్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.













