Tollywood Heroes: 2025ను మిస్ అవుతున్న స్టార్ హీరోలు

తెలుగు సినిమా స్థాయి ప్రపంచ వ్యాప్తంగా బాగా పెరిగింది. అందుకే ఇప్పుడు ఏ సినిమానైనా అటు మేకర్స్, ఇటు హీరోలు ఎంతో జాగ్రత్తగా చేస్తున్నారు. దీంతో బడ్జెట్ పెరగడంతో పాటూ క్వాలిటీ కూడా ఇంప్రూవ్ అయింది. ఫలితంగా సినిమాలు రావడం తగ్గుతున్నాయి. షూటింగ్ కే చాలా ఎక్కువ టైమ్ తీసుకుంటుంది.
ఈ నేపథ్యంలో టాలీవుడ్ లో ఏ హీరో నుంచీ వరుస పెట్టి సినిమాలు రావడం లేదు. ఇంకా చెప్పాలంటే కనీసం ఏడాదికి ఒక సినిమాతో కూడా ఆడియన్స్ ముందుకు రాలేకపోతున్నారు హీరోలు. టాలీవుడ్ నుంచి ప్రతీ యేటా కచ్ఛితంగా ఏదొక సినిమాను తీసుకొస్తున్న హీరో ఎవరైనా ఉన్నారా అంటే అది ప్రస్తుతం నాని(Nani) ఒక్కడే.
మిగిలిన వారిలో మహేష్ బాబు(Mahesh Babu), ఎన్టీఆర్(NTR), రామ్ చరణ్(Ram Charan), అల్లు అర్జున్(Allu Arjun) ఇలా అందరూ పలు పాన్ ఇండియా సినిమాలు చేస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. మహేష్ బాబు, రాజమౌళి(Rajamouli)తో లాక్ అవడం వల్ల ఆయన్నుంచి ఈ ఏడాది సినిమా వచ్చే ఛాన్స్ లేదు. ఎన్టీఆర్ నుంచి ఈ ఏడాది డైరెక్ట్ తెలుగు సినిమా రావడం లేదు. ప్రభాస్ నుంచి కూడా రాజా సాబ్(Raja Saab) వస్తుందనుకున్నారు కానీ ఇప్పుడది కూడా వచ్చేలా లేదు. అల్లు అర్జున్ సినిమా మొదలవడానికే టైమ్ పడుతుంది కాబట్టి ఈ ఇయర్ బన్నీ(Bunny) సినిమా ఇక లేనట్టే. రామ్ చరణ్ చేస్తున్న పెద్ది(Peddhi) సినిమా నెక్ట్స్ ఇయర్ రిలీజని ఇప్పటికే మేకర్స్ ఫిక్స్ చేశారు. కాబట్టి 2025ని ఈ స్టార్ హీరోలంతా బాక్సాఫీస్ వద్ద మిస్ అవుతున్నట్టే లెక్క.