రాక్షస రాజులో మరో స్టార్ హీరో
విరాట పర్వం సినిమా తర్వాత రానా హీరోగా ఇప్పటివరకు మరో సినిమా చేసింది లేదు. మొన్నీ మధ్యే తేజ తో రాక్షస రాజు అనే సినిమాను అధికారికంగా అనౌన్స్ చేశాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమా గురించి ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్న ఓ వార్త, రానా ఫ్యాన్స్ ను బాగా అలరిస్తోంది. రాక్షస రాజు సినిమాలో రానా తో పాటూ మరో స్టార్ హీరో కూడా కనిపించనున్నాడని తెలుస్తోంది.
రాక్షస రాజు కథ బావా బమ్మర్దుల కథతో తెరకెక్కునుందట. బావ ఆనందం కోసం ఏదైనా చేసే బామ్మర్ది పాత్రలో రానా ఈ సినిమాలో కనిపించనున్నాడట. రానా బావ పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ను తేజ ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. మలయాళంలో ప్రయోగాలు చేస్తూ ఆడియన్స్ ను మెప్పిస్తున్న మోహన్ లాల్, రాక్షస రాజు తో తెలుగు ప్రేక్షకుల్ని కూడా మెప్పించాలని చూస్తున్నాడట.
కాగా తేజ గత సినిమా అహింస బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలింది. అయినప్పటికీ రాక్షస రాజు కథ, కథనం బాగా రావడంతో తేజకు రానా ఛాన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరి రానా తనపైన పెట్టుకున్న నమ్మకాన్ని తేజ ఎంతవరకు నిలబెట్టుకుంటాడో చూడాలి.













