వాళ్లు వద్దన్న కథతో ముందుకెళ్తున్న విజయ్
ఫ్యామిలీ స్టార్ సినిమాతో రీసెంట్ గా ఘోరమైన డిజాస్టర్ అందుకున్నాడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ. ఆ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్న విజయ్‌కు ఫ్యామిలీ స్టార్ నిరాశనే మిగిల్చింది. దీంతో విజయ్ తన తర్వాతి సినిమాలపై ఫోకస్ పెట్టాడు. ప్రస్తుతం విజయ్ తన తర్వాతి సినిమాను గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే.
ఈ సినిమా తర్వాత దిల్ రాజు బ్యానర్ లో రవికిరణ్ కోలా దర్శకత్వంలో ఓ సినిమా, రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు విజయ్. ఇదిలా ఉంటే రాహుల్ తో విజయ్ చేస్తున్న సినిమా వాస్తవానికి విజయ్ చేయాల్సింది కాదట. ఈ కథ విజయ్ కంటే ముందే మరో ఇద్దరి హీరోల దగ్గరకు వెళ్లి వాళ్లు కాదంటే విజయ్ కు వచ్చిందట.
ఆ హీరోలు మరెవరో కాదు. తమిళ స్టార్ హీరో సూర్య. శ్యామ్ సింగరాయ్ తర్వాత రాహుల్ ఈ కథను సూర్యకు చెప్పాడట. కథ నచ్చినప్పటికీ తనకున్న వరుస కమిట్మెంట్స్ వల్ల కుదరదని చెప్పాడట. సూర్య కాదనడంతో అదే కథను సూర్య తమ్ముడు కార్తీకి చెప్పాడట రాహుల్. కార్తీ ఈ కథ తనకు సూటవదని రిజెక్ట్ చేసినట్లు సమాచారం. మొత్తానికి అలా ఇద్దరు అన్నదమ్ములు కాదన్న కథను కాస్త అటూ ఇటూ మార్చి విజయ్ కు చెప్పి రాహుల్ సినిమాను ఓకే చేయించుకున్నాడు. మరి విజయ్ తో రాహుల్ చేస్తున్న ఈ భారీ ప్రయోగం ఆడియన్స్ ను ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి.













