SSMB29 స్టోరీ మెయిన్ పాయింట్ ఇదేనట
గుంటూరు కారం సినిమా తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళితో తన 29వ సినిమాను చేయనున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం రాజమౌళి ఈ సినిమాకు సంబంధించిన వర్క్ షాప్స్ లో బిజీగా ఉన్నట్లు సమాచారం.
ఇప్పటికే ఈ స్క్రిప్ట్ ఆల్మోస్ట్ లాకైపోయిందట. దానికి సంబంధించిన్న కొన్ని లీక్స్ బయటకు వచ్చాయి. వాటి ప్రకారం ఈ సినిమాలోని కీలక పాయింట్ అంతులేని బంగారు సంపద చుట్టూ తిరుగుతుందట. అమెజాన్ లాంటి డీప్ ఫారెస్ట్ లో ప్రమాదకరమైన జంతువులు, పరిస్థితుల మధ్య హీరో చేసే వేట సినిమాకు మెయిన్ హైలైట్ గా నిలుస్తుందట.
గతంలో ఈ బ్యాక్ డ్రాప్ లో చాలా కథలొచ్చాయి కానీ విజయేంద్ర ప్రసాద్ ఈ కథకు ఓ రకమైన ఫాంటసీ టచ్ ను ఇచ్చారని తెలుస్తోంది. దానికి రాజమౌళి దర్శకత్వం తోడైతే నెక్ట్స్ లెవెల్ లో ఉంటుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముందుగా ఈ సినిమాకు మహారాజా అనే టైటిల్ ను అనుకున్నారు కానీ దాన్ని ఆల్రెడీ విజయ్ సేతుపతి వాడుకోవడంతో ఇప్పుడు కొత్త టైటిల్ కోసం ఆలోచిస్తున్నారట. ఈ సినిమా కోసం మహేష్ ఎంతలేదన్నా రాజమౌళికి మూడేళ్లు టైమివ్వాల్సిందే.













