SSMB29: రాజమౌళి- మహేష్ సినిమాలో మరో హీరోయిన్

డైరెక్టర్ రాజమౌళి(Rajamouli), మహేష్ బాబు(Mahesh Babu) కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఎస్ఎస్ఎంబీ29(SSMB29) వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమా సైలెంట్ గా సెట్స్ పైకి వెళ్లి శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే రెండు షెడ్యూళ్ల షూటింగ్ పూర్తి చేసుకున్న ఎస్ఎస్ఎంబీ29లో ప్రియాంక చోప్రా(Priyanka Chopra) హీరోయిన్ గా నటిస్తోంది.
భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాను రాజమౌళి హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కిస్తున్నాడు. ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. ఎస్ఎస్ఎంబీ29లో మరో హీరోయిన్ ఓ కీలక పాత్రలో నటించనుందని తెలుస్తోంది. ఆ హీరోయిన్ మరెవరో కాదు శ్రద్ధా కపూర్(Shradha Kapoor). రాజమౌళి- మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో శ్రద్ధా కపూర్ ను తీసుకోవాలని మేకర్స్ భావిస్తున్నారట.
మూవీలో ఆ పాత్ర కథకు అనుగుణంగా సెకండాఫ్ లో వస్తుందని, ఆ పాత్ర సినిమాలో ఎంతో కీలకమైందని అంటున్నారు. ఈ వార్తల్లో నిజమెంతన్నది తెలియదు కానీ నిజంగా శ్రద్ధా కూడా ఈ మూవీలో నటిస్తే సినిమాపై ఉన్న అంచనాలు ఇంకాస్త పెరగడం ఖాయం. కీరవాణి(Keeravani) సంగీతం అందిస్తున్న ఈ సినిమాను కె.ఎల్ నారాయణ(KL Narayana) భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్(Prithviraj Sukumaran) కీలక పాత్రలో కనిపించనున్నాడు.