SSMB29: రాజమౌళి కొత్త సినిమా ముహూర్తం రేపే
సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu), దర్శకధీరుడు రాజమౌళి(Rajamouli) కాంబినేషన్ లో తెరకెక్కే సినిమా కోసం అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఈ సినిమా మొదలవుతుందా అని వెయిట్ చేస్తున్న మహేష్ ఫ్యాన్స్ నిరీక్షణకు రేపటితో తెర పడుతుంది. జనవరి 2న ఎస్ఎస్ఎంబీ29(SSMB29) అఫీషియల్ గా లాంచ్ కాబోతుంది.
హైదరాబాద్ లోని రాజమౌళి ఆఫీస్ లో ఈ కార్యక్రమం జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ ఈవెంట్ కు మీడియాని అనుమతిస్తారా లేక యూనిట్ సభ్యులతో కార్యక్రమం కానిచ్చేస్తారా అనేది ఇంకా తెలియలేదు. మహేష్ తన సినిమాల ఓపెనింగ్ కు ఎప్పుడూ రాడు. అది తను సెంటిమెంట్ గా భావిస్తాడు. మరి ఇప్పుడు రాజమౌళి సినిమాకు కూడా మహేష్ అదే ఫాలో అవుతాడా లేక వస్తాడా అన్నది చూడాలి.
ఇంకా టైటిల్ ఫిక్స్ కాని ఈ సినిమాపైనే ఇప్పుడందరి దృష్టి ఉంది. ఈ సినిమా పూర్తవడానికి ఎంత టైమ్ పడుతుందనేది రాజమౌళి చెప్పలేదు కానీ ఎంతలేదన్నా రెండు మాత్రం ఈజీగా పడుతుంది. అంటే 2027 వరకు మహేష్ బాబు నుంచి కొత్త సినిమా రాదని ఫిక్స్ అయిపోవచ్చు. అమెజాన్ అడవుల నేపథ్యంలో సాగే ఈ సినిమాకు కీరవాణి(Keeravani) సంగీతం అందిస్తున్నాడు. ఈ నెలాఖరు నుంచి సినిమా షూటింగ్ మొదలయ్యే ఛాన్సుంది.













