SSMB29: ఈవెంట్ తోనే రికార్డు సృష్టిస్తున్న జక్కన్న
దర్శకధీరుడు రాజమౌళి(rajamouli), సూపర్ స్టార్ మహేష్ బాబు(mahesh babu) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఎస్ఎస్ఎంబీ29(SSMB29) పైనే ఇప్పుడందరి చూపూ ఉంది. ఈ మూవీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎలాంటి అప్డేట్స్ ఇవ్వని జక్కన్న(Jakkanna) నవంబర్ లో భారీ సర్ప్రైజ్ ను ఇవ్వనున్నట్టు గతంలో ప్రీ లుక్ పోస్టర్ రిలీజ్ చేస్తూ చెప్పడంతో ఇప్పుడందరి దృష్టి దానిపైనే ఉంది. రాజమౌళి చెప్పినట్టే నవంబర్ 15న ఈ సినిమాకు సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేస్తూ ఓ భారీ ఈవెంట్ ను రామోజీ ఫిల్మ్ సిటీ(RFC)లో ప్లాన్ చేశారు.
సాధారణంగా రాజమౌళి ఎప్పుడూ తన సినిమాల కలెక్షన్లతో రికార్డులు సృష్టిస్తూ ఉంటాడు. కానీ ఈ సినిమా విషయంలో చాలా ముందు నుంచే రికార్డు సృష్టించబోతున్నాడు. అందులో భాగంగానే ఎప్పుడూ లేనిది టైటిల్, ఫస్ట్ లుక్ లాంచ్ కు భారీ ఈవెంట్ ను ప్లాన్ చేయడంతో పాటూ దానికి 130 అడుగుల వెడల్పు, 100 అడుగుల ఎత్తైన భారీ ప్లాట్ఫామ్ ను రెడీ చేయిస్తున్నాడు.
ఇండియన్ సినీ హిస్టరీలో ఏ ఈవెంట్ స్టేజ్ ఇంత భారీగా సెట్ వేయలేదు. ఈ ఘనత కూడా రాజమౌళికే దక్కనుంది. దాంతో పాటూ ఈ ఈవెంట్ మొత్తాన్ని జియో హాట్స్టార్ ద్వారా లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వనుండటం కూడా ఓ రికార్డే. సినిమాకు సంబంధించిన గ్లింప్స్ రిలీజ్ ఈవెంట్ ను ఇప్పటివరకు ఎవరూ ఇలా లైవ్ స్ట్రీమింగ్ చేయలేదు. కానీ రాజమౌళి చేస్తున్నాడు. చూస్తుంటే టైటిల్, గ్లింప్స్ రిలీజయ్యాక ఎస్ఎస్ఎంబీ29 మరిన్ని రికార్డులు సృష్టించడం ఖాయంగా అనిపిస్తుంది.







