డైలమాలో #SSMB28 మేకర్స్
సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో మహేష్28 సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ఇప్పటికే రిలీజ్ అయింది. ఇంకా టైటిల్ పెట్టని ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యి చాలా నెలలే అవుతుంది. దీంతో నెట్టింట ఈ సినిమాకు పరిశీలనలో ఉన్న టైటిల్స్ కొన్ని ప్రచారంలోకి కూడా వచ్చాయి.
ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేయడానికి ముహూర్తం ఫిక్స్ చేశారు మేకర్స్. సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా మే 31న ఈ సినిమా టైటిల్ ను రివీల్ చేయనున్నారు. మోసగాళ్లకు మోసగాడు సినిమా రీరిలీజ్ అయ్యే థియేటర్లలో ఈ గ్లింప్స్ రిలీజ్ చేసేందుకు ఇప్పటికే భారీ ఏర్పాట్లను ప్లాన్ చేశారు. అభిమానులతో కౌంట్ డౌన్ చెప్పించి ఈ టైటిల్ ను రిలీజ్ చేయబోతున్నారు.
తన తండ్రి బర్త్ డే రోజు ఫ్యాన్స్ కి తన అప్ కమింగ్ సినిమా నుంచి ఏదొక స్పెషల్ గిఫ్ట్ ఇవ్వడం మహేష్ కి ఓ సెంటిమెంట్. అందుకే కృష్ణ బర్త్ డేకి టైటిల్ గ్లింప్స్ రెడీ చేశారు. మాస్ కట్ తో గ్లింప్స్ రెడీ అయింది. ఈ సినిమాకు అమరావతికి అటు ఇటు అనే టైటిల్ తో పాటు గుంటూరు కారం అనే మాస్ టైటిల్ ని కూడా పరిశీలిస్తున్నారు. ఈ రెండింటిలో మహేష్ సినిమాకు ఏ టైటిల్ ఫిక్స్ చేయాలని మేకర్స్ డైలమాలో ఉన్నట్లు తెలుస్తోంది. మరి మహేష్ కోసం త్రివిక్రమ్ ఈసారి ఎలాంటి టైటిల్ ను ఫిక్స్ చేస్తాడో చూడాలి.













