థమన్ పైనే బాలయ్య సినిమా భారమంతా
వీర సింహారెడ్డి తర్వాత నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం భగవంత్ కేసరి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య చేస్తున్న ఈ సినిమా మీద అందరికీ మంచి అంచనాలున్నాయి. వరుస హిట్లతో మంచి జోష్ లో ఉన్న బాలయ్య భగవంత్ కేసరితో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా టీజర్ రిలీజ్ కాగా, అది ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది.
అక్టోబర్ 19న భగవంత్ కేసరి ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతుంది. రిలీజ్ కు మరో రెండు నెలలే ఉండటంతో ఈ సినిమా సాంగ్స్ ను రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ సింగిల్ ను సెప్టెంబర్ మొదటి వారంలో రిలీజ్ చేయాలని చూస్తున్నారట. వినాయకుడి మీద సాగే ఈ పాటను ఫస్ట్ వీక్ లో రిలీజ్ చేస్త వినాయక చవితి నాటికి ఫుల్ హైప్ క్రియేట్ అవుతుందనేది మేకర్స్ ప్లాన్.
దీంతో బాలయ్య ఫ్యాన్స్ ఎప్పుడెప్పడు ఈ సాంగ్ విందామా అని ఉవ్విళ్లూరుతున్నారు. దీనికి కారణం లేకపోలేదు. ఈ మధ్య థమన్ సంగీతం అందించడంలో కాస్త తడబడుతున్నాడు. బ్రో సినిమాకు థమన్ ఇచ్చిన మ్యూజిక్ జనాలకు పెద్దగా ఎక్కలేదు. దీంతో బాలయ్య మూవీకి థమన్ ఎలాంటి ట్యూన్స్ ఇచ్చాడా అని లోలోపల ఫ్యాన్స్ కంగారుపడుతున్నారు. ఇప్పటివరకు ఈ సినిమాపై ఫుల్ పాజిటివ్ టాకే ఉంది. బాలయ్య లుక్స్ దగ్గర నుంచి, హీరోయిన్స్, డైరెక్టర్ విషయంలో అన్నీ ప్లస్ లే. దానికి తగ్గ మ్యూజిక్ ను థమన్ ఇస్తే మాత్రం భగవంత్ కేసరి పేరుతో బాలయ్య ఖాతాలో మరో హిట్ పడటం ఖాయం. ఏదేమైనా సరే ఇప్పుడు ఆ భారమంతా థమన్ పైనే ఉంది.













