దేవీ, థమన్ కలిసి పనిచేయనున్నారా?
టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్స్‌లో టాప్ లిస్ట్‌లో ముందు గుర్తొచ్చేది దేవీ శ్రీ ప్రసాద్, థమన్. వరుస బ్లాక్బస్టర్లతో థమన్ ఇప్పుడు మొదటి స్థానంలో ఉన్నప్పటికీ, రీసెంట్గా వాల్తేరు వీరయ్య సినిమాతో తనలో ఎనర్జీ ఇంకా చాలా ఉందని చాటి చెప్పాడు. పుష్ప2 ది రూల్‌తో మళ్లీ తనేంటో నిరూపించుకుంటానని ఈ సినిమాతో సిగ్నల్ ఇచ్చి నమ్మకం చూపిస్తున్నాడు. వీరిద్దరి కలయిక బయట చాలా తక్కువ. ఆ మధ్య మీలో ఎవరు కోటీశ్వరులుకి జూ. ఎన్టీఆర్ కోసం కలిసి వెళ్లడం తప్పించి బయట ఈవెంట్ల దగ్గర స్క్రీన్ షేర్ చేసుకుంది చాలా అంటే చాలా తక్కువ. తాజా సమాచారం ప్రకారం ఈ ఇద్దరూ కలిసి పనిచేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే వీరిద్దరూ కలిసి పనిచేసేది సినిమా కోసం కాదు. త్వరలో మొదలుకానున్న ఐపీఎల్2023 లో ఆడబోయే సన్‌రైజర్స్ టీమ్ కోసం ఓ స్పెషల్ బ్యాక్ గ్రౌండ్ సాంగ్‌ని వీరిద్దరూ కలిసి కంపోజ్ చేయనున్నారట.
మరి వీరిద్దరూ కలిసి మరొకరు పాడతారా లేదా ఇద్దరు కలిసి పనిచేసి వేరే సింగర్స్‌తో పాడిస్తారా అనేది తెలియాలంటే వెయిట్ చేయాలి. ఈ ఇద్దరి కాంబోలో సాంగ్ అనే విషయమే ఫ్యాన్స్‌కు బాగా కిక్ ఇస్తుంది. ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు కానీ ఆల్మోస్ట్ ఫిక్స్ అని టాక్. మరి ఈ ఇద్దరూ ఓ మంచి సిగ్నేచర్ సాంగ్ ఇచ్చారంటే అది సన్ రైజర్స్‌కి మంచి సాంగ్‌గా మిగిలిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.













