Rajamouli: వారణాసి కోసం రాజమౌళి రెమ్యూనరేషన్ ఎంతంటే?
మహేష్ బాబు(mahesh babu), రాజమౌళి(rajamouli) కలయికలో వస్తున్న సినిమా వారణాసి(varanasi). పాన్ వరల్డ్ మూవీగా రూపొందుతున్న వారణాసిలో ప్రియాంక చోప్రా(priyanka chopra), పృథ్వీ రాజ్ సుకుమారన్(prithviraj sukumaran) కీలక పాత్రల్లో నటించనుండగా, రీసెంట్ గా వారణాసి నుంచి రిలీజైన ఓ 3 నిమిషాల వీడియో యావత్ ప్రపంచాన్ని టాలీవుడ్ వైపు చూసేలా చేసింది. 2027 సమ్మర్ లో వారణాసి రిలీజ్ కానుందని జక్కన్న(jakkanna) రీసెంట్ గానే జరిగిన భారీ ఈవెంట్లో వెల్లడించాడు.
వారణాసి 2027లో రిలీజైనా, ఆ తర్వాత రిలీజైనా సినిమా వచ్చినప్పుడు అందరూ దాని గురించి మాట్లాడుకోవడం ఖాయమని క్లారిటీ వచ్చింది. ఈ సినిమాను ముందుగా రూ.1000 కోట్లతో చేద్దామనుకున్నారు కానీ ఇప్పుడు టెక్నాలజీ పెరిగిన నేపథ్యంలో బడ్జెట్ ను రూ.1200 కోట్లకు పెంచారని తెలుస్తోంది. కె.ఎల్ నారాయణ(KL Narayana)తో పాటూ రాజమౌళి కొడుకు ఎస్ఎస్ కార్తికేయ(SS Karthikeya) ఈ మూవీని భారీగా నిర్మించనుండగా, కార్తికేయ ఈ సినిమాతోనే మొదటిసారి నిర్మాత అవతారమెత్తాడు.
తన సినిమాల క్వాలిటీ విషయంలో ఎప్పుడూ రాజీపడని జక్కన్న ఈ సినిమాకు కార్తికేయ కూడా నిర్మాత అవడంతో బడ్జెట్ విషయంలో ఎక్కడా ఆలోచించడం లేదని తెలుస్తోంది. అయితే ఈ సినిమాకు రాజమౌళి ఎంత ఛార్జ్ చేస్తున్నాడనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రాజమౌళి ఏ సినిమా చేసినా నెలకు ఇంత చొప్పున కనీస జీతం తీసుకుని, మూవీ రిలీజయ్యాక వచ్చే లాభాల్లో 50% తీసుకోవడం అతనికి అలవాటు. ఇప్పుడు వారణాసి మూవీకి కూడా రాజమౌళి అదే చేస్తున్నాడని తెలుస్తోంది.






