పాకిస్థాన్ చిత్రోత్సవంలో రాజమౌళి
కథాబలం ఉంటే ఏ సినిమా అయినా ఖచ్చితంగా విజయవంతం అవతుందని ప్రముఖ దర్శకులు ఎస్ఎస్ రాజమౌళి చెప్పారు. పాకిస్థాన్లోని కరాచీలో జరుగుతున్న పాకిస్థాన్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో బాహుబలి దర్శకుడు అయిన రాజమౌళి పాల్గొన్నారు. బహుబలి చిత్రం ఈ చిత్రోత్సవంలో ప్రదర్శితం అయి పలువురి మన్ననలు పొందింది. బాహుబలి చిత్ర నిర్మాణ శోభ యార్లగడ్డ, నటి నందితా దాస్, వినయ్ పాఠక్ ఇతరులు భారత చలనచిత్ర రంగం తరపున ఆహ్వానితులుగా ఈ ఉత్సవాలకు హజరయ్యారు. జనర్ బస్టర్స్ అనే అంశంపై రాజమౌళి ఇతరులు ప్రసంగించారు.
సినిమాకు కథ ప్రాణం అని, కథలోని భావోద్వేగాలతో సినిమాకు బలం చేకూరుతుందని, కళాత్మకమా? వాణిజ్యమా అనే దానితో నిమిత్తం లేకుండా కథా బాగా ఉంటే చిత్రం విజయవంతం అవుతుందని రాజమౌళి చెప్పారు. కరాచీలో నాలుగు రోజుల చలనచిత్రతోత్సవం జరిగింది. బాహుబలి చిత్రాలు రెండు ప్రత్యేకంగా ప్రదర్శితం అయ్యాయి. కథ బాగా ఉంటే అది ప్రేక్షకుల మదిలోకి దూసుకువెళ్లితే సినిమా విజయవంతం అవుతుందని విశ్లేషించారు. నటి నందితా దాస్ మాట్లాడుతూ భారత్లో కళాత్మక, స్వేచ్ఛాయుత భావనల సినిమాలకు స్థానం లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.













