డ్రీమ్ ప్రాజెక్ట్‌పై కసరత్తు
నిత్యం షూటింగ్స్‌తో బిజీగా ఉండే సినీ పరిశ్రమ లాక్‌డౌన్‌తో ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. షూటింగ్స్ వల్ల కుటుంబ సభ్యులకు ఎప్పుడూ అందుబాటులో ఉండని సినీజనం ఇప్పుడు ఇళ్ళల్లో ఉంటూ ఫ్యామిలీ మెంబర్స్‌తో ఎంజాయ్ చేస్తున్నారు. కొంతమంది మాత్రం తమకు దొరికిన ఈ ఫ్రీ టైమ్‌ని తమలోని స్కిల్స్ పెంచుకోవడానికి, క్రియేటివిటీని డెవలప్ చేసుకోవడానికి వాడుకుంటున్నారు. అలాంటి వారిలో డైరెక్టర్ రాజమౌళి పేరును మొదట ప్రస్తావించాలి. మొన్నటి వరకు ఆర్ఆర్ఆర్ షూటింగ్‌తో బిజీగా ఉన్న రాజమౌళి ఇప్పుడు లాక్డౌన్ కారణంగా ఇంట్లోనే ఉంటూ తన దగ్గర ఉన్న ఐడియాస్‌ను డెవలప్ చేసే పనిలో పడ్డారు.
ఆర్ఆర్ఆర్ తర్వాత మహేష్‌తో సినిమా ఉంటుందని ఇటీవల రాజమౌళి ప్రకటించిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాదికి ఆర్ఆర్ఆర్ రిలీజ్ అవుతుంది. దాని తర్వాత వెంటనే మహేష్ సినిమా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఖాళీగా ఉన్న రాజమౌళి తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన మహాభారత గురించి ఆలోచిస్తున్నారు. మహేష్‌తో సినిమా కంప్లీట్ అయిన తర్వాత ఈ భారీ ప్రాజెక్ట్‌ని సెట్స్‌పైకి తీసుకెళ్తాడని తెలుస్తోంది. మహాభారతలో అన్నీ ఇంపార్టెంట్ క్యారెక్టర్సే ఉంటాయి కాబట్టి టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్.. ఇలా దేశంలోని అన్ని భాషల నటీనటులు ఇందులో నటించే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా ఈ సినిమాలో ఎన్టీఆర్ ఓ కీలక పాత్రలో నటిస్తారని సమాచారం. ఈ విషయాన్ని రాజమౌళి గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే. మరి మహాభారతలో ఎన్టీఆర్ చెయ్యబోయే ఆ కీలక పాత్ర ఏమిటనేది తెలియాల్సి ఉంది.













