Junior: ‘జూనియర్’ సినిమా ఫస్ట్ డే చూడాలన్న ఇంట్రస్ట్ ని క్రియేట్ చేసింది – ఎస్ఎస్ రాజమౌళి

ప్రముఖ రాజకీయ నాయకుడు, వ్యాపారవేత్త గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి, రాధా కృష్ణ దర్శకత్వం వహించిన యూత్ ఎంటర్‌టైనర్ ‘జూనియర్’ (Junior) తో హీరోగా అరంగేట్రం చేస్తున్నాడు. శ్రీలీల (Sree Leela) హీరోయిన్ గా నటిస్తోంది. జెనీలియా కీలక పాత్ర పోషిస్తున్నారు. వారాహి చలన చిత్రం బ్యానర్‌పై రజని కొర్రపాటి నిర్మిస్తున్నారు. ఈ సినిమా పాటలు చార్ట్‌బస్టర్ హిట్ అయ్యాయి. టీజర్, ట్రైలర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. సినిమా జూలై 18న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ముఖ్య అతిధిగా హాజరైన ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.
ప్రీరిలీజ్ ఈవెంట్ లో దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. సాయి గారు ఈ సినిమా మొదలుపెట్టినప్పుడు మంచి కథతో ఒక చిన్న సినిమా చేస్తున్నారని అనుకున్నాను. కానీ శ్రీలీల, జెనీలియా, రవిచంద్రన్ గారు, దేవి శ్రీ ప్రసాద్, సెంథిల్, పీటర్, ఇలా ఒక్కొక్క ఎడిషన్ చూస్తుంటే ఒక పెద్ద సినిమాకి ఎలా అయితే నటీనటులు టెక్నీషియన్స్ ఉంటారు అలా పెట్టుకుంటూ తీసుకెళ్లారు. చాలా పెద్ద సినిమా చేశారు. సినిమా 1000 + ప్లస్ స్క్రీన్స్ లో రిలీజ్ అవుతుందంటే దానికి కారణం ఆడియన్స్ లో ఉన్న ఇంట్రెస్ట్. ఆడియన్స్ కి ఈ సినిమాని ఫస్ట్ డే చూడాలనే ఆసక్తి క్రియేట్ అయ్యింది. సినిమాని ఈ లెవెల్ కి తీసుకొచ్చిన సాయిగారిని అభినందిస్తున్నాను. జెనీలియా అప్పుడు ఎలా వుందో ఇప్పుడూ అలాగే ఉంది. సెంథిల్ ఈ సినిమాలో కొత్త జెనీలియాని చూపిస్తారని నమ్మకం ఉంది. దేవి ఎప్పుడు కూడా తన మ్యూజిక్ తో సినిమాని ఎలివేట్ చేస్తాడు. వైరల్ వయ్యారి ఎంత వైరల్ అయిందో మళ్లీ దాని గురించి స్పెషల్ గా చెప్పక్కర్లేదు. ఈ సినిమా ఈ సినిమాని ఫస్ట్ డే చూడాలనే ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేయించిన సాంగ్ అది. సెంథిల్ గురించి చెప్పాలంటే సొంత ఇంట్లో మనిషి గురించి చెప్పినట్టే ఉంటుంది. తను అద్భుతమైన టెక్నీషియన్. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వడు.
డైరెక్టర్ని కూడా కాంప్రమైజ్ అవ్వనివ్వడు. ఈ సినిమాకి తను బిగ్ ఎసెట్. పీటర్ క్రేజీ మ్యాన్. ఇంకా ఏదో బెటర్ గా చేయాలనే తపన తనలో ఉంటుంది. విపరీతంగా కష్టపడతాడు. పీటర్, సెంథిల్ ఇద్దరు కలిసి ఒక అబ్బాయి బాగా చేస్తున్నాడని చెప్బుతున్నారంటే.. కిరీటీకి అంతకంటే పెద్ద సర్టిఫికెట్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండదు. వాళ్ళ బాగా పొగుడుతున్నారంటే ఇది నిజంగా బెస్ట్ కాంప్లిమెంట్స్. ఈ సినిమా కిరీటీని తప్పకుండా పెద్ద స్థాయికి వెళుతుంది. శ్రీలీల అద్భుతమైన డాన్సర్. తను ఇంకా పెద్దస్థాయికి వెళుతుంది. రాధాకృష్ణ మూడు సంవత్సరాల నుంచి ఈ ప్రాజెక్టు మీద ఉన్నారు. ఈ సినిమా కోసమే కష్టపడ్డారు. ఇంత అద్భుతమైన ప్రాజెక్టుని బయటకు తీసుకొచ్చారు. తప్పకుండా ఈ సినిమా మంచి ఫలితాన్ని ఇచ్చి తనకు మంచి పేరు తీసుకొస్తుంది. జూలై 18న సినిమా రిలీజ్ అవుతుంది. తప్పకుండా అందరూ థియేటర్స్ లో చూడండి. పైసా వసూల్ మూవీ ఇది. అందరికీ థాంక్యు.’అన్నారు.
హీరో కిరీటి మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. నిర్మాత సాయి గారు నామీద నమ్మకం పెట్టినందుకు ఆయనకు జీవితాంతం కృతజ్ఞతతో ఉంటాను. ఈ సినిమా నాకోసం 1% సాయి గారి కోసం 99% సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాను. ఒక డైరెక్టర్ పైకి వస్తే ఇండస్ట్రీకి చాలా మంచిది. రాధాకృష్ణ ఈ సినిమాతో ఒక మంచి గుర్తింపు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జెనీలియా మేడం గారు మోస్ట్ బ్యూటిఫుల్ హ్యూమన్ బీయింగ్. ఆమె 13 సంవత్సరాల తర్వాత మళ్లీ ఈ సినిమాతో కం బ్యాక్ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. చాలా అద్భుతమైన పాత్ర చేశారు. రెగ్యులర్ గా చూసే క్యారెక్టర్ కాదు. చాలా యూనిక్ గా ఉంటుంది. నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది సెంథిల్ గారు. ఆయనకి ఎప్పటికీ కృతజ్ఞతలు ఉంటాను. దేవి గారు మ్యూజిక్ ఈ సినిమాకి బిగ్ ఎసెట్. కళ్యాణ్ గారు అద్భుతమైన మాటలు పాటలు రాశారు. సినిమాలో అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్ కంపోజ్ చేసిన పీటర్ మాస్టర్ కి వెంకట్ మాస్టర్ కి థాంక్యూ. ఇందులో ఒక సీక్వెన్స్ ఉంటుంది. ఇప్పటివరకు ఇండియన్ సినిమాలో ఎప్పుడూ చూసి ఉండరు. పీటర్ మాస్టర్ వల్లే ఆ ఫైట్ పాసిబుల్ అయింది. ఈ సినిమాలో పనిచేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఈ సినిమా కోసం మూడేళ్లు కష్టపడ్డాము. జూలై 18న సినిమా రాబోతోంది. కష్టపడి నిజాయితీగా ప్రయత్నిస్తే తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు కూడా పైకి తీసుకొస్తారు. నా కోసమే కాదు ఈ సినిమాలో కష్టపడిన వారు చాలామంది ఉన్నారు. కొత్త యాక్టర్స్ ఉన్నారు. వాళ్ళందరి కోసం ఈ సినిమాకి ప్రోత్సాహాన్ని ఇవ్వాలని, విజయాన్ని అందించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. జై ఎన్టీఆర్. థాంక్యూ ఆల్’అన్నారు.
హీరోయిన్ జెనీలియా మాట్లాడుతూ. . అందరికీ నమస్కారం. జూనియర్ తో మీ అందర్నీ కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. నన్ను మళ్ళీ తెరపైకి తీసుకువచ్చిన టీమ్ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. నన్ను ఎంతగానో ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు. కిరీటికి జూలై 18 వెరీ బిగ్ డే. మేమందరం కూడా తనని సపోర్ట్ చేస్తాము. తన సక్సెస్ ని సెలబ్రేట్ చేసుకుంటాము’అన్నారు.
హీరోయిన్ శ్రీ లీల మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. ఈ వేడుకకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన రాజమౌళి గారికి, మీడియా వారికి, అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. సాయి గారికి థాంక్యూ సో మచ్. ఈరోజు నాకు అమ్మవారు విగ్రహాన్ని ఇచ్చారు. వాళ్ళ ఇంటికి లక్ష్మీదేవి రావాలని కోరుకుంటున్నాను. డైరెక్టర్ రాధాకృష్ణ గారు మూడేళ్లు కష్టపడి ఒక అద్భుతమైన సినిమాతో మన ముందుకు వస్తున్నారు. నాకు వైరల్ వయ్యారి టాగ్ వచ్చిందంటే దేవిశ్రీప్రసాద్ గారి వల్లే. సాంగ్ షూట్ జరిగినప్పుడు కూడా మా అందరికీ వచ్చి ఒక ఎనర్జీ ఇచ్చారు. అద్భుతమైన ఆల్బమ్ ఇచ్చిన ప్రసాద్ గారికి థాంక్యూ సో మచ్. సెంథిల్ గారితో పనిచేయడం గ్రేట్ ఎక్స్పీరియన్స్. జెనీలియా గారు తెలుగులో తెలుగు సినిమాల్లో ఒక బ్రాండ్ క్రియేట్ చేశారు. ఆమెతో కలిసి నటించడం చాలా ఆనందంగా ఉంది. మా హీరో కిరీటి గారికి సినిమా తప్పితే మరొక ధ్యాస లేదు. చాలా డెడికేషన్ తో పని చేశారు. చాలా హార్డ్ వర్క్ చేశారు. ఈ సినిమాలో పనిచేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు’అన్నారు
దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఇది చాలా లవ్లీ మూవీ. చాలా ఎంజాయ్ చేస్తూ వర్క్ చేశాను. సాయి గారు చాలా అద్భుతంగా ఈ ప్రాజెక్ట్ ని నిర్మించారు. డైరెక్టర్ రాధాకృష్ణ గారు చాలా ఫ్యాషన్ ఉన్న డైరెక్టర్. ఈ సినిమా తర్వాత ఆయన మరిన్ని అద్భుతమైన సినిమాలు చేస్తారని నమ్మకం ఉంది. ఈ సినిమా కోసం మూడేళ్లు కష్టపడ్డారు. తప్పకుండా ఈ సినిమా ఆయనకి చాలా మంచి పేరు తీసుకొస్తుంది. కళ్యాణ్ చక్రవర్తి గారు ఈ సినిమాకి అద్భుతమైన మాటలు లిరిక్స్ రాశారు. శ్రీమణి కూడా ఇందులో మరో అద్భుతమైన పాట రాశారు. సెంథిల్ గారు బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి అద్భుతమైన సినిమాలో తీసిన కెమెరామెన్. అయితే ఒక కొత్త కుర్రోడుతో సినిమా చేస్తున్నప్పుడు కూడా అదే ప్యాషన్ తో వర్క్ చేశారు. రియల్లీ హాట్సాఫ్. పీటర్ మాస్టారు చాలా అద్భుతమైన యాక్షన్ కంపోజ్ చేశారు. మీరందరూ థియేటర్స్ లో చాలా ఎంజాయ్ చేస్తారు. హాసిని వెల్కమ్ బ్యాక్. జెనీలియా గారిని మళ్ళీ తెరపై చూడడం చాలా ఆనందంగా ఉంది. చాలా డిఫరెంట్ క్యారెక్టర్. మీరు చాలా సర్ప్రైజ్ అవుతారు.శ్రీలీల అద్భుతమైన డాన్సర్. వైరల్ సాంగ్ అదరగొట్టారు. కిరీటి చాలా పెద్ద స్టార్ అవుతాడు. ఇందులో ఓ యాక్షన్ ఎపిసోడ్ ఉంటుంది. మీరందరూ థ్రిల్ అవుతారు. అంత అద్భుతంగా యాక్షన్ పెర్ఫాం చేశాడు. డాన్సులు ఇరగదీసాడు. తనను చూస్తే ఫస్ట్ సినిమా అనే ఫీలింగ్. కామెడీ యాక్షన్ ఎమోషన్ అన్ని ఎలిమెంట్స్ ఇందులో ఉన్నాయి. అల్లు అర్జున్ గారికి ఆర్య సినిమా ఎలాంటి విజయాన్ని అందించిందో కిరీటికి జూనియర్ సినిమా అలాంటి విజయాన్ని అందిస్తుందని అనుకుంటున్నాను. అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’అన్నారు.
డిఓపి సెంథిల్ కుమార్ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. రాజమౌళి గారితో మైల్ స్టోన్ మూవీస్ చేసిన అదృష్టం నాకు దొరికింది. ఆయన ఈ వేడుకకు రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా నేను చేయడానికి కారణం నిర్మాత సాయి గారు. డైరెక్టర్ ఈ కథ చెప్పినప్పుడు నాకు చాలా నచ్చింది. కిరీటి చాలా అద్భుతమైన టాలెంట్ ఉన్న యాక్టర్. డాన్స్, పెర్ఫార్మన్స్ చాలా అద్భుతంగా చేశాడు. ఇంత డెడికేషన్ ఉన్న యాక్టర్ ని నా కెరియర్ లో చూడలేదు. కాళ్ల నుంచి రక్తం వస్తున్నా పర్ఫెక్షన్ కోసం 200 టేకులు చేసాడు. తప్పకుండా తను ఫ్యూచర్లో పెద్ద స్టార్ అవుతాడు. రాధాకృష్ణ సినిమాని చాలా అద్భుతంగా తీశాడు. జులై 18న అందరూ థియేటర్స్ లో చూడండి. తప్పకుండా ఎంజాయ్ చేస్తారు’అన్నారు.
ఫైట్ మాస్టర్ పీటర్ హెయిర్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. కిరీటి చాలా అద్భుతమైన యాక్షన్ ఈ సినిమాలో చేసాడు. తనతో వర్క్ చేయడం చాలా మంచి ఎక్స్పీరియన్స్. ద బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. యాక్షన్ కి చాలా అద్భుతంగా ప్రిపేర్ అయ్యాడు. తనకి చాలా అద్భుతమైన భవిష్యత్తు ఉంటుంది’అన్నారు
యాక్టర్ సందీప్ రాజ్ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. ఈ సినిమా అంతా నాకు తెలుసు. ఈ సినిమా మీ అంచనాలను మించి ఉంటుంది. రాధాకృష్ణ నా ఫ్రెండ్. తను చాలా అద్భుతమైన రైటర్. ఎంటర్టైన్మెంట్ తో పాటు మంచి ఎమోషనల్ గా ఈ సినిమా తీశాడు. కిరీటి నాకు మూడేళ్లుగా తెలుసు. తను చాలా అద్భుతమైన టాలెంట్ ఉన్న యాక్టర్. మీరు ఊహించిన దానికంటే అద్భుతమైన పెర్ఫార్మన్స్ ఇస్తాడు. ఇందులో ఒక చిన్న సీన్ చేశాను.సెంథిల్ గారు ఆ ఫ్రేమ్ ని తీయడం అనేది వెరీ మెమొరబుల్ ఎక్స్పీరియన్స్. అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్. అడ్వాన్స్ కంగ్రాచ్యులేషన్స్’అన్నారు.
యాక్టర్ వైవా హర్ష మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. వారాహి బ్యానర్, దేవి శ్రీ ప్రసాద్ గారు, సెంథిల్ గారు… ఒక డ్రీమ్ కాంబినేషన్ ఇది. ఇలాంటి సినిమాల్లో పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ కాంబినేషన్ కిరీటి గారి వలన సాధ్యమైంది. కిరీటి చాలా డెడికేషన్ తో వర్క్ చేస్తారు. జూలై 18న తప్పకుండా అందరూ థియేటర్స్ లో ఈ సినిమా చూడండి. తప్పకుండా ఎంజాయ్ చేస్తారు’అన్నారు. మూవీ యూనిట్ అంతా పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.