ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ ప్రారంభం
ఎన్టీఆర్, రామ్చరణ్ కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్ (వర్కింగ్ టైటిల్) మొదటి షెడ్యూల్ ప్రారంభమైంది. ఈ చిత్రం కోసం వేసిన భారీసెట్లో ఈ షెడ్యూల్ను చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్లో ఎన్టీఆర్, రామ్చరణ్ పై కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కించనున్నారు. బాహుబలితో దేశావ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఆగ్ర దర్శకుడు రాజమౌళి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సుమారు రూ.200 కోట్ల భారీ బడ్జెట్తో డివివి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై దానయ్య డివివి నిర్మిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. 2020లో భారీ అంచనాల మధ్య ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.













