‘ఆర్ఆర్ఆర్’ లెక్కల చిట్టా విప్పిన రాజమౌళి
రాజమౌళి తెలుగు సినిమా సత్తాను ఇండియాకే కాదు..ప్రపంచానికి సైతం తెలియజేశారు. అంతే కాదు తెలుగు సినిమా మార్కెట్ పరిధి ఎంతో తన చిత్రాల ద్వారా తెలియచేసారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రూపొందిన చిత్రం ఆర్ఆర్ ఆర్ ఈ సినిమా కోసం ఒక్కో రోజుకు ఎంత మేరకు ఖర్చు పెట్టామనే విషయాన్ని రీసెంట్ ఇంటర్వ్యూలో తెలియజేశారు. జక్కన్న లెక్కలు వింటే వామ్మో అనాల్సిందే మరి.ఇప్పుడు ఇండియన్ సినిమా నెంబర్ వన్ డైరెక్టర్ ఎవరంటే.. తడుముకోకుండా వినిపించే పేరు మన జక్కన్నదే. ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ మాత్రమే అని చాలా మంది అనుకుంటున్న తరుణంలో ‘బాహుబలి’ వంటి విజువల్ వండర్‌తో తెలుగు సినిమా సత్తాను ఇండియాకే కాదు..ప్రపంచానికి సైతం తెలియజేశారు. మన హీరోలను పాన్ ఇండియా హీరోలే కాదు.. పాన్ వరల్డ్ హీరోలుగా చేశారు. ఇప్పుడు ఈయన దర్శకత్వంలో సినిమా రానుందని అంటే ఎలాంటి అంచనాలుంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
అలాంటి దర్శకుడు రూపొందించిన లేటెస్ట్ మూవీ ఆర్ఆర్ ఆర్. మార్చి 25న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతుండటంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.అంతా బాగానే ఉంది. కానీ, ఆర్ఆర్ ఆర్ ఎంత ఖర్చు అయ్యిందనే దానిపై మొన్నటి వరకు నాలుగు వందల కోట్లకు పైగా అని చెబుతూ వచ్చారు. కానీ ఇప్పుడు లెక్కలు చూస్తే మరింత ఎక్కువగానే ఖర్చు అయినట్లు తెలిసింది. జి.ఎస్.టి, హీరోలు, దర్శకుడు రెమ్యునరేషన్స్ కాకుండా.. కేవలం సినిమా మేకింగ్ కోసమే రూ.336 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టారని ఏపీ మంత్రి పేర్ని నాని బయటకు చెప్పేశారు. ఇక రెమ్యునేషన్స్, జి.ఎస్.టి అంతా కలుపుకుని చూస్తే ఐదు వందల కోట్ల రూపాయలకు పైగానే ఆర్ఆర్ ఆర్ కోసం ఖర్చు పెట్టినట్లు అవగతం అవుతుంది.
రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో రాజమౌళి.. ఎన్టీర్ – రామ్ చరణ్‌లతో మాట్లాడారు. బడ్జెట్ విషయంగా వారిద్దరితో మాట్లాడే క్రమంలో ఆర్ఆర్ఆర్ కోసం ఒక్కో రోజుకి ఎంత ఖర్చు పెట్టారనే విషయాన్ని ఆయన చెప్పారు. దర్శక ధీరుడు చెప్పిన దాని ప్రకారం ఒకరోజుకి రూ.50 లక్షల మేరకు ఖర్చు పెట్టారట. ఒక రోజుకు పది షాట్స్ చిత్రీకరించేవారట. అంటే ఒక్కో షాట్‌కు అయిన ఖర్చు ఐదు లక్షలు. విజువల్ ఎఫెక్ట్స్ కోసం ఆర్ఆర్ఆర్ లో భారీగానే ఖర్చు పెట్టారు. ఈ చిత్రాన్ని డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై పది సంవత్సరాల క్రితం రాజమౌళి కి అడ్వాన్స్ ఇచ్చినట్లు డివివి దానయ్య పేర్కొన్నారు.













