SSMB29: మహేష్ పాస్‌పోర్ట్‌ను లాగేసుకున్న జక్కన్న
సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu), రాజమౌళి(Rajamouli) కాంబినేషన్ లో పాన్ వరల్డ్ మూవీకి సంబంధించిన ఏ విషయమైనా సరే బయటికొచ్చిన క్షణాల్లోనే వైరల్ అయిపోతుంది. రీసెంట్ గా పూజా కార్యక్రమాలతో మొదలైన ఈ సినిమా గురించి త్వరలోనే అప్డేట్ వస్తుందని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కు నిన్న రాత్రి సడెన్ గా ఓ క్రేజీ మీమ్ లాంటి ప్రమోషన్ తో అందరి దృష్టిని ఎట్రాక్ట్ చేశాడు రాజమౌళి.
సింహంని జైల్లో బంధించి దాని పాస్‌పోర్ట్‌ని తీసుకున్నట్లు ఉన్న తన ఫోటోని స్వయంగా రాజమౌళినే తన ఇన్‌స్టాలో షేర్ చేయడంతో ఒక్కసారిగా అది ట్రెండింగ్ అయింది. ఆ పోస్ట్ కు కామెంట్ గా రాజమౌళి ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విననని కామెంట్ చేయడం మరింత కిక్కిస్తోంది. షూటింగ్ కు గ్యాప్ వస్తే ఫ్యామిలీతో కలిసి విదేశాలకు వెళ్లడం మహేష్ కు అలవాటు.
కానీ ఇప్పుడు రాజమౌళితో వర్క్ చేసేటప్పుడు అవన్నీ కుదరవు. ఆ కారణంతోనే రాజమౌళి, పాస్ పోర్ట్ తీసుకున్నట్టు అర్థం వచ్చేలా సినిమాను అనౌన్స్ చేయడం అందరికీ కిక్కిస్తోంది. రాజమౌళి పోస్ట్ కు మహేష్ తో పాటూ ప్రియాంక చోప్రా(Priyanka Chopra) కూడా రెస్పాండ్ అవడం మరింత ఆసక్తిని కలిగిస్తోంది. అయితే ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయినా లేక రాజమౌళి మరేదైనా ట్విస్ట్ ఇస్తాడా అన్నది తెలియాల్సి ఉంది.













