ప్లాస్మా దానం చేయండి హీరోలు కండి అంటూ పిలుపునిచ్చిన రాజ మౌళి
కరోనా వైరస్ బారిన పడిన దర్శక ధీరుడు యస్ యస్ రాజ మౌళి నెగటివ్ రిపోర్ట్ రావడంతో ముందుగా అతను ప్రకటించిన విధంగా ప్లాస్మా దానం చేస్తాను అని అన్నారు .
ఈ సందర్భంగా కమిషనరేట్ లో జరిగిన “డొనేట్ ప్లాస్మా” క్యాంపెయిన్ లో తాను భార్య రామా రాజమౌళి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ : “ప్లాస్మా డోనర్స్ ను చూస్తుంటే చాలా ఆనందం అనిపించింది. ఎవరైతే ప్లాస్మా దానం చేస్తున్నారో వాళ్లు అసలైన హీరోలు. వాళ్లే యోధులు. రోజూ నేను చాలామంది హీరోల్ని హీరోల్ని చూస్తుంటాను. కానీ ప్రజల మధ్య నుంచి వచ్చిన ఈ హీరోల్ని (ప్లాస్మా దాతలు) చూస్తుంటే గర్వంగా అనిపించింది. నా బాడీలో కూడా రోగనిరోధక శక్తి పెరిగితే నేను కూడా ప్లాస్మా డొనేట్ చేస్తాను. హీరోను అవుతాను.మీరూ ప్లాస్మా దానం చేయండి హీరోలు కండి .” అన్నారు కరోనా నుంచి కోలుకున్న తర్వాత తొలిసారి బయటకొచ్చాడు రాజమౌళి. హైదరాబాద్ పోలీస్ తో కలిసి “డొనేట్ ప్లాస్మా” క్యాంపెయిన్ లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా మాట్లాడిన రాజమౌళి, కరోనాపై ఎలాంటి అపోహలు వద్దంటున్నాడు.
“కరోనాపై ఎలాంటి అపోహలు వద్దు. ఇప్పుడు రకరకాల మందులొచ్చాయి. దాదాపు 20 రకాల మందులొచ్చాయి. అన్ని దశల్లో కరోనాను తగ్గించగలిగే ట్రీట్ మెంట్స్ వచ్చేశాయి. వైద్యుల దగ్గర ప్లాస్మా ఉందంటే అది బ్రహ్మాస్త్రంలా పనిచేస్తుంది.” అన్నారు. కరోనా నుంచి కోలుకున్న వ్యక్తులంతా ప్లాస్మా దానం చేయాలని పిలుపునిస్తున్నాడు రాజమౌళి. ఇంకా ఈ కార్యక్రమం లో మ్యూజిక్ డైరెక్టర్ ఎం ఎం కీరవాణి , ఆయన సతీమణి వల్లి, రాజ మౌళి కుమారుడు కాల భైరవ కూడా పాల్గొన్నారు.













