మరో సినిమా చేయనున్న ప్రభాస్- రాజమౌళి
చిత్ర పరిశ్రమలో కొన్ని కాంబినేషన్స్ అంటే ఆ క్రేజ్, దాని రేంజే వేరుగా ఉంటుంది. అలంఆటి వరకు కాంబినేషనే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్- దర్శకధీరుడు రాజమౌళిది. బాహుబలి సినిమాతో ఎన్నో వండర్స్ సృష్టించిన వీరి జంట, ఆ వెంటనే మరో ప్రాజెక్ట్ ను లాక్ చేసుకున్నారు. కాకపోతే ఎవరి కమిట్మెంట్స్ వాళ్లు పూర్తి చేసుకుని, మళ్లీ కలుద్దామని బాహుబలి టైమ్‌లోనే అనుకున్నారట.
ఈ విషయాన్ని టాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజు వెల్లడించారు. ప్రభాస్ తో సినిమా ఎప్పుడు చేస్తారని దిల్ రాజుని అడగ్గా, దానికి వెంటనే దిల్ రాజు మాట్లాడుతూ, ప్రభాస్ రాజమౌళితో సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా అయ్యాక మా బ్యానర్లో సినిమా ఉండబోతుందని చెప్పుకొచ్చాడు. ప్రభాస్ చేతిలో నాలుగు ప్రాజెక్ట్ లు ఉన్నాయని, ఆ తర్వాత ఉండే కాంబో తమదేనని దిల్ రాజు రివీల్ చేశాడు.
అంటే రాజమౌళి- ప్రభాస్ ఇప్పటికే మరో బ్యానర్‌కు కమిట్ అయి ఉండొచ్చు. దాని తర్వాతే ప్రభాస్ దిల్ రాజు బ్యానర్లో మూవీ చేసే అవకాశం ఉండి ఉండొచ్చు. దీన్ని బట్టి చూస్తే మహేష్ సినిమా తర్వాత రాజమౌళి డైరెక్ట్ చేయబోయేది మళ్లీ ప్రభాస్‌నే అన్నమాట. రాజమౌళి, మహేష్ మూవీని పూర్తి చేయడానికి ఎంత లేదన్నా రెండేళ్లు పడుతుంది.
ఈలోపు ప్రభాస్ తనకున్న కమిట్మెంట్లు మొత్తం పూర్తి చేసుకుని రాజమౌళి కోసం రెడీ అవుతున్నాడన్నమాట. ఇప్పటికే ఛత్రపతి, బాహుబలి1, బాహుబలి2తో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసిన ఈ కాంబోలో ఈసారి రానున్న సినిమా హాలీవుడ్ రేంజ్లో తెరకెక్కనుందేమో చూడాలి.













