Srinidhi Shetty: డే, నైట్ షిఫ్ట్ చేస్తానంటున్న శ్రీనిధి

కెజిఎఫ్1(KGF1) మూవీతో హీరోయిన్ గా పరిచయమైన శ్రీనిధి శెట్టి(srinidhi shetty) ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ అందుకుంది. ఆ తర్వాత కెజిఎఫ్2(KGF2)తో మరో బ్లాక్ బస్టర్ ను అందుకున్న శ్రీనిధి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంది. కెజిఎఫ్ తో వచ్చిన క్రేజ్ ను జాగ్రత్తగా కాపాడుకుంటున్న శ్రీనిధి ఆ తర్వాత హిట్3(hit3) సినిమా చేసి దాంతో మరో హిట్ ను ఖాతాలో వేసుకుంది.
సినిమాల విషయంలో ఆచితూచి అడుగులేస్తున్న శ్రీనిధి శెట్టి ఇప్పుడు తెలుసు కదా(Thelusu Kadha) అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయింది. సిద్ధు జొన్నలగడ్డ(sidhu jonnalagadda) హీరోగా తెరకెక్కుతున్న ఈ మూవీ అక్టోబర్ 17న రిలీజ్ కానుండగా, ఆ చిత్ర ప్రమోషన్స్ లో శ్రీనిధి శెట్టి యాక్టివ్ గా పాల్గొంటుంది. ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో శ్రీనిధికి ఓ ఇంట్రెస్టింగ్ ప్రశ్న ఎదురైంది.
మహేష్ బాబు(mahesh babu), ఎన్టీఆర్(NTR) తో వర్క్ చేసే అవకాశమొస్తే ఇద్దరిలో ఎవరితో చేస్తారనే ప్రశ్న ఎదురవగా, దానికి సమాధానమిస్తూ ఆఫర్లను ఎందుకు తక్కువ చేసుకుంటాను? ఇద్దరి సినిమాలకీ డేట్స్ అడ్జస్ట్ చేసి డే అండ్ నైట్ డబుల్ కాల్షీట్స్ ఇస్తానని చెప్పింది శ్రీనిధి. ఈ మూవీతో మహేష్ ఫ్యాన్స్, ఇటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను శాటిస్‌ఫై చేసేలా ఆన్సర్ ఇవ్వడంతో అమ్మడి తెలివిని అందరూ మెచ్చుకుంటున్నారు.