Srinidhi Shetty: సెట్స్ లో నానిని ఎప్పుడూ నిర్మాతగా చూడలేదు
నేచురల్ స్టార్ నాని(nani) అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ను స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత మెల్లిగా హీరోగా మారి ఎన్నో సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అక్కడితో ఆగలేదు. ఓ వైపు హీరోలుగా సినిమాలు చేస్తూనే మరోవైపు నిర్మాతగా సినిమాలు చేస్తున్నాడు నాని. ఇప్పటికే పలు సినిమాలను నిర్మించి వాటితో మంచి విజయాలను అందుకున్న నాని ఇప్పుడు హిట్3(Hit3) సినిమాను నిర్మిస్తూ తానే హీరోగా నటిస్తున్నాడు.
శైలేష్ కొలను(sailesh Kolanu) దర్శకత్వంలో తెరకెక్కిన హిట్ ఫ్రాంచైజ్ సినిమాల్లో మొదటి రెండు సినిమాలకు కేవలం నిర్మాతగానే వ్యవహరించిన నాని ఇప్పుడు మూడో సినిమాలో హీరోగా నటిస్తూనే సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ సినిమాపై అందరికీ భారీ అంచనాలున్నాయి. మే 1న హిట్3 ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో శ్రీనిధి శెట్టి(Srinidhi Shetty) హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయమవుతుంది.
ప్రమోషన్స్ లో భాగంగా శ్రీనిధి, నాని సెట్స్ లో ఎలా ఉంటాడో వెల్లడించింది. మామూలుగా ఎవరైనా నిర్మాతలంటే సెట్స్ లో ఏం జరుగుతుందో, ఏంటో ప్రతీదీ పట్టించుకుంటూ జాగ్రత్తగా ఉంటూ ఉంటారని, కానీ నాని అలా కాదని, తాను ఇప్పటివరకు నానిని నిర్మాతగా చూడలేదని, సెట్స్ లో కూడా నాని నిర్మాతగా కాకుండా యాక్టర్ గా ఉండటానికే ప్రాధాన్యతనిస్తాడని చెప్పుకొచ్చింది. నాని డబ్బుని నమ్మే నిర్మాత కాదని, మ్యాజిక్ ను నమ్మే నిర్మాత అని కూడా శ్రీనిధి ఈ సందర్భంగా తెలిపింది.






