Srikanth Vissa: డైరెక్టర్ గా మారనున్న మరో రైటర్
ఏదైనా సినిమా సక్సెస్ అవాలంటే దానికి రైటింగ్ కూడా చాలా ముఖ్యం. కేవలం రైటింగ్ వల్లే ఆడిన సినిమాలు చాలా ఉన్నాయి. అందుకే రైటర్ విషయంలో మేకర్స్ ముందుగా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే రైటర్ గా కొంత అనుభవం వచ్చాక చాలా మంది డైరెక్షన్ వైపు అడుగులేసి, సినిమా తీసి తమ సత్తా చాటాలని అనుకుంటూ ఉంటారు.
అందులో భాగంగానే ఇప్పటికే పలువురు రైటర్లు డైరెక్టర్లుగా మారి సక్సెస్ అవగా, మరికొందరు మాత్రం ఇంకా డైరెక్టర్లుగా ప్రూవ్ చేసుకోవడానికి కష్టపడుతూనే ఉన్నారు. త్రివిక్రమ్(Trivikram), కొరటాల శివ(koratala siva), అనిల్ రావిపూడి(Anil Ravipudi).. వీళ్లంతా డైరెక్టర్లు కాకముందు రైటర్లే. ఇక అసలు విషయానికొస్తే టాలీవుడ్ లో పలు సినిమాలకు రైటర్ గా వర్క్ చేసిన శ్రీకాంత్ విస్సా(Srikanth vissa) ఇప్పుడు డైరెక్టర్ గా మారనున్నట్టు తెలుస్తోంది.
ఎంసీఏ(MCA), వెంకీ మామ(Venky mama), టైగర్ నాగేశ్వరరావు(tiger Nageswara rao), రావణాసుర(ravanasura), డెవిల్(devil), పుష్ప2(pushpa2) సినిమాలకు పని చేసిన శ్రీకాంత్ డైరెక్టర్ గా మారాలని డిసైడై, అందులో భాగంగానే నందమూరి కళ్యాణ్ రామ్(Kalyan ram) ను కలిసి రీసెంట్ గా ఓ కథ చెప్పారని, ఆ కథకు కళ్యాణ్ రామ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుందని సమాచారం.







