Chiranjeevi: మరోసారి ప్రయోగం చేయనున్న మెగాస్టార్
40 ఏళ్లుగా మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) చూడని జయాపజయాలు లేవు. ఇప్పుడు ఆయన కొత్తగా ప్రూవ్ చేసుకోవాల్సిందేమీ లేదు. అయినా కానీ తన ఏజ్ ను సైతం లెక్క చేయకుండా చిరూ ఎప్పటికప్పుడు కష్టపడుతూనే ఉంటాడు. తన కథా ఎంపికల్లోని తప్పుల్ని గమనించిన చిరూ భోళా శంకర్(Bhola Shankar) తర్వాత ఎంతో జాగ్రత్తగా సినిమాలను ఎంచుకుంటున్నాడు.
అందులో భాగంగానే వశిష్ఠ(Vasishta) తో విశ్వంభర(Viswambhara) చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. తాజాగా శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela)కు కూడా చిరూ ఓకే చెప్పిన విషయం తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం శ్రీకాంత్ తో చిరూ చేయనున్న సినిమాలో హీరోయిన్, కమర్షియల్ సాంగ్స్ ఉండట్లేదని తెలుస్తోంది. ఇంకా పూర్తి స్థాయిలో స్టోరీ రెడీ కాలేదు కానీ చిరూ(Chiru)ని రెగ్యులర్ ఫార్మాట్ లో చూపించనని శ్రీకాంత్ ముందే మాటిచ్చాడట.
చిరూకి ఇలాంటి ప్రయోగాలు చేయడం కొత్తేమీ కాదు. ఆల్రెడీ గాడ్ ఫాదర్(God Father) కోసం చిరూ ఇలాంటి ప్రయోగమే చేశాడు. కాకపోతే ఆ సినిమాలో లాస్ట్ లో ఓ పబ్ సాంగ్ ఉంటుంది. శ్రీకాంత్ ఇప్పుడు వాటికి కూడా చోటివ్వడం లేదని తెలుస్తోంది. ఒకరకంగా ఇది మంచి విషయమే అనుకోవాలి. మరి శ్రీకాంత్ ఓదెల తన ఫేవరెట్ హీరో చిరూని ఏ రేంజ్ లో ప్రెజెంట్ చేస్తాడో చూడాలి. ప్రస్తుతం శ్రీకాంత్ నాని(Nani) ది ప్యారడైజ్(the Paradise) సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. ఆ సినిమా అయిపోయాక చిరూ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు శ్రీకాంత్.













