Chiranjeevi: చిరూ అలా ఎలా నమ్మాడు?
మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)ని కేవలం ఒకే ఒక్క సినిమా తీసిన అనుభవమున్న దర్శకుడు తన కథతో మెప్పించాడంటే అది మామూలు విషయం కాదు. అసలే చిరంజీవి కథల విషయంలో ఎంతో కేర్ తీసుకుంటాడు. స్టోరీ డిస్కషన్స్ టైమ్ లో తన ఎక్స్పీరియన్స్ ను వాడి కథ బాగా డెవలప్ అయ్యేలా చేస్తారని కూడా అంటారు.
అయితే కొన్నిసార్లు మెగాస్టార్ ఇచ్చిన ఇన్పుట్సే కథను రాంగ్ రూట్ లో తీసుకెళ్తాయనే టాక్ కూడా చిరూపై ఉంది. రీసెంట్ గా చిరంజీవి దసరా(Dasara) ఫేమ్ శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela) తో సినిమాను అనౌన్స్ చేసి అందరికీ షాకిచ్చాడు. చిరూ ఇచ్చిన ఈ స్వీట్ షాక్ అందరికీ నచ్చింది. కొత్త తరం డైరెక్టర్లతో చిరూ(Chiru) వర్క్ చేయడం ఆయన ఫ్యాన్స్ కు మంచి జోష్ ఇస్తుంది.
అయితే అసలు శ్రీకాంత్ చిరూకి ఏం చెప్పి ఒప్పించాడనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దసరా తర్వాత రెండో సినిమాను కూడా శ్రీకాంత్ నానితోనే చేస్తున్నాడు. ఈ టైమ్ లో శ్రీకాంత్ చిరు కోసం ఓ స్టోరీ రెడీ చేయగా నాని(Nani) సపోర్ట్ తో చిరంజీవిని కలిసి ఆ కథ వినిపించాడు. చిరూ కంటే ముందే నాని ఈ కథ విని ఎంతో నచ్చి ఆ కథను నమ్మి చిరూ దగ్గరకు తీసుకెళ్లి మరీ శ్రీకాంత్ కథను రిఫర్ చేశాడట. చిరూకి కూడా శ్రీకాంత్ చెప్పిన కథ బాగా నచ్చడంతో వెంటనే ఓకే చేశాడంటున్నారు. చిరూ-శ్రీకాంత్ కాంబోలో రానున్న ఈ సినిమా పీరియాడికల్ ఫిల్మ్ అని సమాచారం.













