శ్రీకాంత్ చేతుల మీదుగా ‘అప్పుడు -ఇప్పుడు’ పాట
సుజన్, తనిష్క్ జంటగా నటిస్తున్న చిత్రం ఆప్పుడు ఇప్పుడు. యు.కె.ఫిలింస్ పతాకంపై ఉషారాణి కనుమూరి, విజయరామకృష్ణంరాజు నిర్మిస్తున్నారు. చలపతి పవ్వుల దర్శకుడు. ఈ సినిమాలోని ఓ గీతాన్ని హీరో శ్రీకాంత్ విడుదల చేశారు. నిర్మాతలు మాట్లాడుతూ గ్రామీణ నేపథ్యంలో సాగే అందమైన ప్రేమకథ ఇది. భిన్న ధృవాల్లాంటి ఓ జంట ఎలా ప్రేమలో పడ్డారు? వారి ప్రయణ ప్రయాణంలో ఎదురైన పరిణామాలేమిటన్నది అలరిస్తుంది. వినోదానికి పెద్దపీట వేస్తున్నాం. శ్రీకాంత్ పాటను విడుదల చేయడం ఆనందంగా ఉంది. ప్రస్తుతం సెన్సార్ జరుపుతున్నాం. త్వరలో విడుదల తేదీని వెల్లడిస్తాం అని అన్నారు. శివాజీరాజా, శ్రీనివాస్పేరుపు రెడ్డి, మాధవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం :పద్మానావ్ భరద్వాజ్.













