కేన్స్ లో అతిలోక సుందరికి గౌరవం
అతిలోక సుందరి శ్రీదేవి ప్రతిష్ఠాత్మక కేన్స్ చిత్రోత్సవాల్లో గౌరవం దక్కింది. ఆమెను కేన్స్ వేడుకల్లో ఒక్కసారి స్మరించుకొన్నారు. సినిమా ప్రపంచానికి శ్రీదేవి చేసినా సేవలకుగానూ టైటాన్ రెజనాల్ట్ ఎఫ్.లూయిస్ ఫిల్మ్ ఐకాన్ పురస్కారాన్ని ప్రకటించారు. శ్రీదేవి కుటుంబ సభ్యులకు బదులుగా ఆ అవార్డును ప్రముఖ దర్శకుడు సుభాష్ ఘయ్, నిర్మాత నమ్రత గోయల్ స్వీకరించారు. ప్రపంచవ్యాప్తంగా సినిమాలకు విశేష సేవలందించే వారికి ఈ అవార్డుని అందజేస్తారు. శ్రీదేవి నటించిన చిత్రాలు, ఆమె జీవితానికి సంబంధించిన విశేషాలతో రూపొందించిన ఓ వీడియోను కూడా ఈ వేడుకల్లో ప్రదర్శించారు. ఇటీవల ప్రమాదవశాత్తు శ్రీదేవి మరణించిన విషయం తెలిసిందే.













