Sri Nidhi Shetty: హిట్3 తో పెరిగిన శ్రీనిధి డిమాండ్
కెజిఎఫ్(KGF) సినిమాలతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న శ్రీనిధి శెట్టి(Srinidhi Shetty) ఆ సినిమాలో కేవలం గ్లామర్ పాత్రకే పరిమితమవడం వల్ల స్టార్ డమ్ అందుకోలేకపోయింది. రీసెంట్ గా హిట్3(Hit3) సినిమాతో సూపర్ హిట్ అందుకుని మంచి క్రేజ్ ను సంపాదించుకుంది శ్రీనిధి. హిట్3 తర్వాత శ్రీనిధి తెలుగులో బిజీ అయ్యే అవకాశాలు బాగానే కనిపిస్తున్నాయి.
ఆల్రెడీ కన్నడ ఇండస్ట్రీలో కెరీర్ ను స్టార్ట్ చేసి తర్వాత తెలుగులోకి వచ్చి ఇక్కడ సినిమాలు చేసిన రష్మిక(rashmika), శ్రీలీల(Sreeleela) టాలీవుడ్ లో విపరీతమైన క్రేజ్ ను సంపాదించుకుని ఇప్పుడు బాలీవుడ్ లో కూడా బిజీ అయిన నేపథ్యంలో మరో కన్నడ భామ సక్సెస్ అందుకుని క్రేజ్ ను సంపాదించుకోవడం హాట్ టాపిక్ గా మారింది.
మధ్యలో శ్రీనిధి కోబ్రా(Cobra) అనే తమిళ సినిమా చేసినప్పటికీ ఆ సినిమా అమ్మడికి అనుకున్న గుర్తింపుని ఇవ్వలేకపోయింది. మూడేళ్ల తర్వాత ఇప్పుడు హిట్3 తో తిరిగి వెండితెరపై కనిపించి మంచి హిట్ తో పాటూ స్టార్డమ్ ను కూడా అందుకుంది. ప్రస్తుతం తెలుగులో తెలుసు కదా సినిమాలో నటిస్తున్న శ్రీనిధి, కన్నడలో సుదీప్(Sudeep) హీరోగా ఓ సినిమా చేస్తోంది. చూస్తుంటే శ్రీనిధి కూడా తెలుగులో స్టార్ హీరోయిన్ గా మారే అవకాశాలున్నట్టు అనిపిస్తోంది.






