Sreevishnu: SV17 టైటిల్ అనౌన్స్మెంట్ అప్డేట్
విభిన్నమైన కథలను ఎంచుకుంటూ వరుసపెట్టి సినిమాలు చేసుకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో శ్రీ విష్ణు(Sree vishnu). కంటెంట్ బేస్డ్ మూవీస్ చేస్తూ శ్రీ విష్ణు ప్రేక్షకులందర్నీ ఎంటర్టైన్ చేస్తూ వస్తున్నాడు. గత కొన్ని సినిమాలుగా వరుస సక్సెస్లు అందుకుంటున్న శ్రీ విష్ణు గతేడాది రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు.
ప్రస్తుతం శ్రీ విష్ణు ఓ క్రేజీ మూవీ చేస్తున్నాడు. శ్రీ విష్ణు కెరీర్లో 17(SV17)వ చిత్రంగా ఇది రూపొందుతుంది. హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వంలో రానున్న ఈ మూవీలో రెబా మోనికా జాన్(Reba Monica John) హీరోయిన్ గా నటిస్తుంది. కీరవాణి(Keeravani) కొడుకు కాల భైరవ(Kala Bhairava) ఈ మూవీకి మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇన్విస్టిగేటివ్ థ్రిల్లర్ గా వస్తోన్న ఈ మూవీలో శ్రీ విష్ణు డిటెక్టివ్ గా కనిపించనున్నట్టు సమాచారం.
ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ టీజర్ మరియు టైటిల్ ను శ్రీవిష్ణు బర్త్ డే సందర్భంగా ఫిబ్రవరి 28 ఉదయం 11.07 గంటలకు రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ తెలిపారు. ఈ మూవీలో శ్రీవిష్ణు మేకోవర్ చాలా కొత్తగా, ఇంట్రెస్టింగ్ గా ఉండనుంది. లైట్ బాక్స్ మీడియా మరియు పిక్చర్ పర్ఫెక్ట్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లు ఈ మూవీని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.













