శ్రీనువైట్ల తో సినిమా కన్ఫర్మ్ చేసిన గోపీచంద్
టాలీవుడ్లో ఒకప్పుడు స్టార్ డైరెక్టర్ గా ఓ వెలుగు వెలిగిన శ్రీను వైట్ల నుంచి సినిమా వచ్చి చాలా సంవత్సరాలవుతోంది. అమర్ అక్బర్ ఆంటోనీ ఫలితం తర్వాత ఆయన నుంచి మరో సినిమా వచ్చింది లేదు. ఒకప్పుడు టాలీవుడ్లోని ప్రతి స్టార్ హీరోని డైరెక్ట్ చేసిన ఈ స్టార్ డైరెక్టర్ ఇప్పుడు అవకాశాల్లేక ఖాళీగా ఉన్నారు.
మొన్నీ మధ్య మంచు విష్ణుతో ఢీ సెక్వెల్ అనౌన్స్ చేశారు కానీ అది అనుకోకుండా కొన్ని కారణాల వల్ల క్యాన్సిల్ అయింది. దీంతో శ్రీను వైట్ల తనకు బాగా పట్టున్న కామెడీ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ను రెడీ చేసుకుని మ్యాచో హీరో గోపీచంద్ కు వినిపించాడు. శ్రీను వైట్ల లాంటి పెద్ద దర్శకుడు గోపీకి కథ చెప్పడంతో వెంటనే గోపీచంద్ ఓకే అనేశాడు.
వీరి కాంబోలో సినిమా గురించి ఎలాంటి అనౌన్స్మెంట్ కానీ, అప్డేడ్ కానీ లేకుండానే ఆ నోటా ఈ నోటా వార్త బాగా ప్రచారం అయింది. రీసెంట్ గా గోపీచంద్ ఈ సినిమా గురించి క్లారిటీ ఇచ్చాడు. శ్రీను వైట్లతో చేయబోతున్న సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతోందని గోపీచంద్ చెప్పడంతో ఈ కాంబినేషన్లో సినిమా రానున్న వార్త ఫిక్స్ అని క్లారిటీ వచ్చింది.
జులై లేదా ఆగస్టు నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే ఛాన్సుంది. ఈ లోపు గోపీచంద్ హర్ష డైరెక్షన్ లో చేస్తున్న సినిమా షూట్ ను కొంత వరకు పూర్తి చేస్తాడు. అయితే గోపీచంద్, శ్రీనువైట్లతో పాటుగా డైరెక్టర్ తేజతో కూడా ఓ సినిమాకు కమిట్ అయ్యాడు. ఆ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ కీలకం కావడంతో ప్రస్తుతం హీరోయిన్ను వెతికే పనిలో తేజ బిజీగా ఉన్నాడు. హీరోయిన్ ఓకే అయిన వెంటనే ఆ సినిమా కూడా సెట్స్ పైకి వెళ్లనుంది.













