హాస్పిటల్ పెట్టనున్న శ్రీలీల?
డాక్టర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన శ్రీలీల యాక్టరైంది. బెంగుళూరు నుంచి సినీ పరిశ్రమకు కిస్ అనే కన్నడ సినిమాతో అరంగేట్రం చేసింది. తర్వాత టాలీవుడ్ లో పెళ్లి సందడి సినిమాతో ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత వరుస అవకాశాలు దక్కించుకుని, అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ప్రమోషన్ తెచ్చుకుంది.
సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ శ్రీలీల ఎప్పుడూ తన చదువును అశ్రద్ధ చేయలేదు. అందుకే తల్లి లాగా తను కూడా డాక్టర్ కావాలనుకుంది. ఆ దిశగానే అడుగులేస్తూ ఎంబీబీఎస్ లో జాయినై, ఇప్పుడు ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్‌ను ప్రిపేర్ అవుతుంది. ప్రస్తుతం శ్రీలీల పరీక్షలు రాస్తోంది. ఎగ్జామ్స్ కోసమని ప్రస్తుతం శ్రీలీలతో పాటూ తన తల్లి కూడా ముంబైకు వచ్చిందని తెలుస్తోంది.
డాక్టరైన తన తల్లి సూచనలతో ఎగ్జామ్స్ రాస్తుందట శ్రీలీల. ఎగ్జామ్స్ అయిపోయి రిజల్ట్స్ వచ్చాక శ్రీలీల తల్లితో కలిసి బెంగుళూరులో సొంతంగా హాస్పిటల్ ప్రారంభించే ఆలోచనలో ఉందట. హాస్పిటల్ కంటే ముందు మరి హయ్యర్ స్టడీస్ కు వెళ్లాలా లే సినిమాలు చేస్తూనే హాస్పిటల్ బాధ్యతలు నిర్వర్తించాలా అనేది శ్రీలీల ఇంకా డిసైడ్ అవలేదని తెలుస్తోంది. ఒకవేళ హయ్యర్ స్టడీస్ కు వెళ్లాలంటే మాత్రం శ్రీలీల కచ్ఛితంగా తన సినీ కెరీర్‌ను వదులుకోవాల్సిందే.













