గుంటూరు కారంపైనే ఆశలు పెట్టుకున్న శ్రీలీల
పెళ్లి సందడి2 సినిమాతో టాలీవుడ్ కు హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన శ్రీలీలకు ఆ సినిమా ఫలితంతో సంబంధం లేకుండా వరుసపెట్టి ఆఫర్లొచ్చాయి. దానికి తగ్గట్లే అమ్మడు చేసిన రెండో సినిమా ధమాకా మంచి బ్లాక్ బస్టర్ అవడంతో శ్రీలీల క్రేజ్ మరింత పెరిగింది. ఈ నేపథ్యంలోనే శ్రీలీల టాలీవుడ్ లో మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ గా మారింది.
వరుస సినిమాలతో బిజీగా ఉన్న శ్రీలీల కెరీర్ కు డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. అమ్మడు హీరోయిన్ గా నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద దారుణమైన ఫలితాలనిస్తున్నాయి. ఇప్పటికే రామ్ హీరోగా వచ్చిన స్కంద సినిమాలో శ్రీలీల అసలు ప్రాధాన్యత లేని పాత్ర చేయడంతో ఆ సినిమా ఫలితం అమ్మడుకు ప్లస్ కాలేకపోయింది.
ఇక రీసెంట్ గా వచ్చిన ఆదికేశవ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఇప్పుడు మళ్లీ తాజాగా రిలీజైన నితిన్ ఎక్స్ట్రా మూవీ లో కూడా శ్రీలీల క్యారెక్టర్ పై బాగా నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. లవ్ ట్రాక్ కోసం కొన్ని సీన్లు, పాటల్లో డ్యాన్స్ ల కోసం శ్రీలీలను తీసుకున్నారని వార్తలొస్తున్నాయి .
దీంతో ఇప్పుడు ఈ భామ ఆశలన్నీ మహేష్ బాబు హీరోగా వస్తున్న గుంటూరు కారంమీదే ఉన్నాయి. త్రివిక్రమ్ తన సినిమాలోని మెయిన్ హీరోయిన్ ను చాలా బాగా చూపిస్తాడు. కాబట్టి ఈ సినిమాతో శ్రీలీల బౌన్స్ బ్యాక్ అవుతుందనుకోవచ్చు. ఇకనైనా శ్రీలీల వచ్చిన సినిమాలన్నీ చేయకుండా కొంచెం ఆచితూచి కథలను ఎంచుకుంటే బాగుంటుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.













