డ్యాన్సులతో ఎన్నాళ్లు నెట్టుకొస్తావు శ్రీలీలా?
మొదట సెకండ్ హీరోయిన్ గా గుంటూరు కారం సెట్ లోకి ఎంటరైన శ్రీలీల, ఆ తర్వాత పూజా సినిమా నుంచి తప్పుకోవడంతో మెయిన్ హీరోయిన్ గా ప్రమోషన్ కొట్టేసింది. ఏకంగా సూపర్ స్టార్ సరసన ఛాన్స్ కావడంతో ఈ సినిమా కోసం శ్రీలీల తన ఎంబిబిఎస్ ఎగ్జామ్స్‌ను సైతం తర్వాత రాసుకోవచ్చులే అని లైట్ తీసుకుని మరీ చేసింది.
అయితే ఈ సినిమాలో శ్రీలీల క్యారెక్టర్ డ్యాన్సులు వేయడానికి మాత్రమే పరిమితమైంది తప్పించి కథలో తన పాత్రకు పెద్దగా ప్రాధాన్యముండదు. త్రివిక్రమ్ లాంటి డైరెక్టర్ కూడా శ్రీలీలను డ్యాన్సులకే పరిమితం చేయడం ఆసక్తిని రేపుతోంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మహేష్ కూడా ఈ అమ్మాయితో డ్యాన్స్ అంటే హీరోలకు తాట తెగపోతుందని చెప్పాడు.
అంతా బానే ఉంది కానీ కేవలం డ్యాన్సులతోనే కెరీర్ ను ఎక్కువ కాలం నెట్టుకురావడం కష్టమని శ్రీలీల ఇప్పటికైనా తెలుసుకుంటే బెటర్. ఇప్పటివరకు శ్రీలీలకు నటన పరంగా చెప్పుకునే బ్రేక్ అయితే రాలేదు. భగవంత్ కేసరి సినిమా ఉన్నప్పటికీ అందులో బాలయ్యనే ఎక్కువ క్రెడిట్ తీసుకున్నాడు. ఇప్పటికే మూడు డిజాస్టర్లను అకౌంట్ లో వేసుకున్న శ్రీలీల ఇకపై కథల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గుంటూరు కారం ఫైనల్ రిజల్ట్ ఏంటన్నది మరో వారం రోజుల్లో తేలిపోనుంది.













