శ్రీలీల గురించి నితిన్ ఏమన్నాడంటే?
నితిన్, శ్రీలీల జంటగా వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కామెడీ ఎంటర్టైనర్ ఎక్స్ట్రా. ఈ సినిమా డిసెంబర్ 8న ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయింది. ఈ నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టింది చిత్ర యూనిట్. శ్రీలీల ఎగ్జామ్స్ వల్ల బిజీగా ఉండటంతో నితిన్, డైరెక్టర్, రావు రమేష్ కలిసి ఈ సినిమాను ప్రమోట్ చేసే బాధ్యత తీసుకున్నారు.
తాజాగా నితిన్ ఓ ఇంటర్వ్యూలో భాగంగా శ్రీలీల గురించి మాట్లాడాడు. శ్రీలీలతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందని యాంకర్ అడిగిన ప్రశ్నకు నితిన్ ఆసక్తికర సమాధానమిచ్చాడు. శ్రీలీల బెస్ట్ డ్యాన్సర్ అని నితిన్ కామెంట్ చేశాడు. వయసులో శ్రీలీల 20 అయితే, తను 40ల్లో ఉన్నానని, డ్యాన్స్ పరంగా ఆమెను మ్యాచ్ చేయడం అంత ఈజీ కాదని తెలిపాడు నితిన్.
డ్యాన్స్ విషయంలో ఇప్పటికే పలువురు నుంచి కాంప్లిమెంట్స్ అందుకున్న శ్రీలీల ఇప్పుడు నితిన్ నుంచి కూడా ప్రశంసలు అందుకుంది. ఎక్స్ట్రాలో ఓ మాస్ సాంగ్ ఉందని, ఆ పాటలో శ్రీలీల డ్యాన్స్ సూపర్ గా ఉంటుందని కూడా ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే తన మాస్ స్టెప్పులతో చాలా సినిమాల్లో దుమ్ము లేపిన శ్రీలీల ఎక్స్ట్రా సినిమాలో కూడా తన డ్యాన్స్‌లతో దుమ్ము లేపనుందని తెలుస్తోంది.













