శ్రీలీల పెళ్లి గురించి సిల్లీ రూమర్స్
టాలీవుడ్ మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ గా పేరొందిన శ్రీలీల, తెలుగమ్మాయే అయినా, పుట్టి పెరిగింది కర్ణాటకలో. పెళ్లి సందడి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన శ్రీలీలకు ఆ సినిమాలో అమ్మడి అందం, అభినయంతో పాటూ డ్యాన్స్ లకు ఫిదా అయి ధమాకా సినిమాలో అవకాశమిచ్చారు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో శ్రీలీల బిజీ హీరోయిన్ అయిపోయింది.
ఏకంగా సూపర్‌స్టార్ మహేష్ బాబు చేస్తున్న గుంటూరు కారం సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. మొత్తం అమ్మడి చేతిలో ఇప్పుడు దాదాపు 10 సినిమాలున్నాయి. కేవలం 22 ఏళ్లకే శ్రీలీల టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగుతోంది. కెరీర్ మూడు హిట్లూ, ఆరు ఛాన్సులు అనే దిశగా సాగుతున్న టైమ్ లో శ్రీలీల పెళ్లి గురించి వార్తలొస్తున్నాయి.
వినడానికి విడ్డూరంగా ఉన్నప్పటికీ వార్తలొస్తున్న మాటైతే వాస్తవం. బాలయ్యతో కలిసి ఆమె చేసిన భగవంత్ కేసరి ప్రమోషన్స్ లో భాగంగా శ్రీలీల, బాలయ్య చిత్ర యూనిట్ సభ్యులతో కలిసి ఓ ఫోటో దిగారు. ఈ ఫోటోలో బాలయ్య కొడుకు మోక్షజ్ఞ కూడా శ్రీలీల పక్కనే ఉన్నాడు. దీంతో బాలయ్య కొడుకుతో శ్రీలీల పెళ్లి చేసేస్తున్నారు నెటిజన్లు. తన వెండితెర అరంగేట్రం తో పాటూ, మోక్షు మూవీ మేకింగ్ పై కూడా గ్రిప్ పెంచుకోవాలని భగవంత్ కేసరి టీమ్ తో అసోసియేట్ అయ్యాడు. అందుకే తరచూ ఆ టీమ్ తో ఫోటోల్లో కనిపిస్తున్నాడు. కాకపోతే ఈ సారి ఆ ఫోటోల్లో శ్రీలీల కూడా ఉంది. ఆ మాత్రానికే వాళ్లిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని అనుకోవడం చాలా సిల్లీగా ఉంది.













