భగవంత్ కేసరితో లెక్క సరిచేస్తానంటున్న శ్రీలీల
టాలీవుడ్ లో మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ గా చలామణి అవుతున్న భామ శ్రీలీల. ఈమె సినిమాలు సెప్టెంబర్ నుంచి జవనరి వరకు నెలకు ఓ సినిమా ఉందంటే అమ్మడి రేంజ్ ఏంటనేది అర్థం చేసుకోవచ్చు. వరుస సినిమాలతో మంచి జోష్ లో ఉన్న శ్రీలీల స్కంద సినిమాతో డిజాస్టర్ అందుకుంది. అంతేకాదు ఈ సినిమాలో శ్రీలీల పాత్ర తన కెరీర్ కు ఏ మాత్రం ఉపయోగపడేదిలా లేదు.
దానికి తోడు సెకండాఫ్ లో కేవలం ఏ మాత్రం ప్రాధాన్యత లేకపోవడంతో ఆమెకు స్కంద నిరాశనే మిగిల్చింది. గతేడాది ధమాకాతో మంచి బ్లాక్ బస్టర్ అందుకున్న శ్రీలీలకు స్కంద వల్ల ఓ రకంగా నష్టం జరిగిందనే చెప్పాలి. అయితే ఈ లెక్కలన్నింటినీ బాలయ్యతో చేస్తున్న భగవంత్ కేసరి సినిమాతో సరి చేస్తానంటుంది శ్రీలీల.
బాలయ్య సినిమాలో హీరోయిన్ కు కాకుండా మరో క్యారెక్టర్ కు పెర్ఫార్మెన్స్ చేసే పాత్ర దొరకడం చాలా కష్టం. అలాంటి పాత్రను శ్రీలీల కొట్టేసింది. ట్రైలర్, సాంగ్స్ తోనే శ్రీలీల క్యారెక్టర్ సినిమాకు ఎంత బలమన్నది ఇప్పటికే అనిల్ రావిపూడి చెప్పేశాడు. అంతేకాదు సినిమాలో ఎమోషన్ మొత్తం శ్రీలీల, బాలయ్య చుట్టూనే తిరుగుతుందట.
వీరిద్దరి మధ్య ఉన్న బాండింగ్, భావోద్వేగాలు ఆడియన్స్ ను కట్టిపడేయడం ఖాయమని ఇన్సైడ్ టాక్. అంతేకాదు తనలోని నటిని బయటపెట్టే మూవీ ఇది అని శ్రీలీల గట్టిగా నమ్ముతుంది. సినిమాకు ఉన్న హైప్ చూస్తుంటే ఈ సినిమా బాలయ్యతో పాటూ శ్రీలీలకు కూడా మంచి హిట్ ఇస్తుందనిపిస్తుంది.













